బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి ఓ 20 డేస్ కావొస్తుంది. అప్పుడే సీజన్ 6 గురించిన న్యూస్ లు మొదలైపోయాయి. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద హీరో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 మరో రెండు నెలలు అంటే కొత్త ఏడాది మొదలైన రెండు నెలలకి మొదలు కాబోతుంది అనగానే.. సీజన్ 6 పై అంచనాలు, ఆత్రుత మొదలయ్యాయి. నాగార్జున రీసెంట్ గా ఈసారి బిగ్ బాస్ హాట్ స్టార్ లో అంటే ఓటిటిలో మొదలు కాబోతుంది అని చెప్పారు. అలాగే నాగ్ అలా చెప్పారో లేదో ఇలా బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంటర్ అయ్యేది వీళ్ళే అంటూ అప్పుడే రకరకాల పేర్లు బయటికి వచ్చేసాయి. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలు కాబోయే తేదీపై క్లారిటీ వచ్చేసిందిగా అంటున్నారు.
ఈసారి బిగ్ బాస్ సీజన్ చాలా ఎర్లీ గా ఫిబ్రవరిలోనే మొదలు కాబోతుంది అని.. అది కూడా ఫిబ్రవరి 20 నుండి బిగ్ బాస్ సీజన్ 6 హాట్ స్టార్ లో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఆడిషన్స్ స్టార్ట్ అయ్యాయి అని, లిస్ట్ కూడా ఫైనల్ అవుతుంది అంటున్నారు. అయితే హోస్ట్ గా నాగార్జున చేస్తారా? లేదంటే మరొకరు వస్తారా? అనేది క్లారిటీ లేదు కానీ.. బిగ్ బాస్ సీజన్ 6 కి హోస్ట్ గా ప్రముఖ మేల్ యాంకర్ ఓం కార్ పేరు అయితే సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. మరి ఈసారి ఎంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళతారో కానీ..బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లిన వారిలో ఇప్పుడు సిరి - షణ్ముఖ్ లు పర్సనల్ లైఫ్ లో ప్రోబ్లెంస్ ఫేస్ చేస్తున్నారు. ఈసారి ఎంతమంది, ఎవరెవరు వెళతారనే విషయంలో అందరిలో క్యూరియాసిటీ అయితే ఉంది.