ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నీ తానే అయ్యి నైజాం లో కింగ్ అనిపించుకుందాం అనుకున్నారు, కానీ ఈసారి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ట్రిపిల్ ఆర్ ఇప్పుడు పొస్టుపోన్ అయింది. దాని మీద దిల్ రాజు చాలా డబ్బులు పెట్టి నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. అలానే అతనే భీమ్లా నాయక్ కి కూడా నైజాం ఏరియా రైట్స్ కొన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగు ప్రొడ్యూసర్స్ ఆక్టివ్ గిల్డ్ అంటే తాను ఒక్కడే అందులో ఆక్టివ్ అన్నట్టుగా బిహేవ్ చేసి, భీమ్లా నాయక్ ని పోస్టుపోన్ చేయించాడు. అప్పుడు జరిగిన ప్రెస్ మీట్ కి భీమ్లా నాయక్ నిర్మాతలు రాలేదు కూడా. ఎందుకంటే వాళ్ళకి దిల్ రాజు మీద చాలా కోపం ఉంది.
ఇప్పుడు ఎటూ కాకుండా ట్రిపిల్ ఆర్ లేదు, భీమ్లా నాయక్ లేదు.. సంక్రాంతికి పెద్ద సినిమా అనేది లేకుండా పోయింది. సంక్రాంతి పండగప్పుడు వసూళ్లు బాగా ఉంటాయి, మా సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం, రిలీజ్ చేస్తాం అని భీమ్లా నాయక్ నిర్మాతలు ఎంత చెప్పినా వినకుండా దిల్ రాజు పోస్టుపోన్ చేయించాడు. ఆ పోస్టుపోన్ మెంట్ అనౌన్స్ చేసి ప్రెస్ మీట్ అయ్యాక, దిల్ రాజ్ చాలా గొప్పలు చెప్పుకున్నాడు, తానే అంతా చేసానని. ఇప్పుడు ఏమైంది, మొత్తం కంపు అయ్యింది. భీమ్లా నాయక్ నిర్మాతలు అయితే దిల్ రాజు ని ఒకటే తిట్టుడు తిడుతున్నారట.
అదీ కాకుండా దిల్ రాజు పీ ఆర్ టీం, గిల్డ్ ప్రెస్ మీట్ లని, అదేదో దిల్ రాజు ఇండివిడ్యువల్ ప్రెస్ మీట్ లాగా బిల్డ్ అప్ ఇస్తున్నారు. మొత్తం మటాష్ అయింది, ఇప్పుడు దిల్ రాజు స్వంత సినిమా రిలీజ్ కోసం పాట్లు పడుతున్నాడు.