Advertisementt

సుధీర్ లేడు టీఆర్పీ పడిపోయింది

Mon 03rd Jan 2022 04:25 PM
sudigali sudheer,sudheer,r ashmi,akhil aadi,pradeep,dhee dance show,dhee 14  సుధీర్ లేడు టీఆర్పీ పడిపోయింది
Sudhir dropped out, TRP dropped to Dhee సుధీర్ లేడు టీఆర్పీ పడిపోయింది
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ కి బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించిన సుధీర్ తర్వాత సినిమాల్లో ట్రై చెయ్యడమే కాదు, హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా గాలోడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా రెండు ప్రాజెక్ట్స్ తో సుధీర్ బిజీగా వున్నాడు. అయితే జబర్దస్ నుండి సుధీర్ బ్రేక్ తీసుకోబోతున్నాడనే ప్రచారం జరిగినా సుధీర్ వాటిని కొట్టిపారేశాడు. ఇక జబర్దస్త్ తర్వాత సుధీర్ కి మంచి పేరు తీసుకువచ్చిన వచ్చిన షో ఢీ డాన్స్ షో. ఆ షోలో ఆది తో కలిసి సుధీర్ చేసే కామెడీ, రష్మీ తో రొమాన్స్ అంటూ ఢీ డాన్స్ షో కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

కానీ ఇప్పుడు ఢీ 14 లో అటు రష్మీ ఇటు సుధీర్ ఇద్దరూ మిస్ అయ్యారు. మధ్యలో సుధీర్ ఫాన్స్ మల్లెమాలపై పడ్డారు. మల్లెమాల తప్పించిందా? సుధీర్ తప్పుకున్నాడా? అనే అనుమానంలో ఫాన్స్ గోల గోల చేసారు. ఇకపోతే గత రెండు వారాలుగా ఢీ డాన్స్ షో ని ఎప్పటిలాగే ప్రదీప్ యాంకర్ గా ఆది, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ లు మెంటర్స్ గా వస్తున్నారు. చప్పగా, కామెడీ లేకుండా ఢీ డాన్స్ 14 సీజన్ ఫై బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరియడంతో.. ఆ షో కి గత రెండు వారాలుగా టీఆర్పీ పడిపోయినట్లుగా తెలుస్తుంది. దానితో మల్లెమాల వాళ్ళు మళ్ళీ సుధీర్ ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా టాక్. మరి సుధీర్ మళ్లీ ఢీ షో లో కనబడాలని ఆయన ఫాన్స్ బాగా కోరుకుంటున్నారు. 

Sudhir dropped out, TRP dropped to Dhee:

Sudigali Sudheer opts out of Dhee 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ