Advertisementt

అందరిముందు భార్యకి ఐ లవ్ యు చెప్పిన బాలయ్య

Mon 03rd Jan 2022 01:02 PM
balakrishna,rana,balakrishna unstoppable,unstoppable promo highlights  అందరిముందు భార్యకి ఐ లవ్ యు చెప్పిన బాలయ్య
Balakrishna says I love you to wife on Unstoppable అందరిముందు భార్యకి ఐ లవ్ యు చెప్పిన బాలయ్య
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అంటే కోపం, కోపమొస్తే.. ఎదుటి వాడి చెంప పగులుతుంది అనేది మత్రమే తెలుసు. ఆయన చిన్న పిల్లవాడి మాదిరిగా ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని కూడా తెలుసు. కానీ బాలకృష్ణ లో చిలిపి కృష్ణుడు ఉన్నాడనే విషయం మాత్రం అల్లు అరవింద్ ఆహా ఓటిటి అన్ స్టాపబుల్ టాక్ షో బయట పెట్టింది.. టాక్ షోస్ లో కెల్లా నెంబర్ వన్ టాక్ షో గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఏడు ఎపిసోడ్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కి రానా దగ్గుబాటి గెస్ట్ గా రాబోతున్నాడు. రవితేజ - బాలయ్య ఎపిసోడ్ నిజంగానే అన్ స్టాపబుల్ గా అదరగొట్టేసింది.

ఇక రానా ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. రానా రాగానే బాలకృష్ణ ఏమయ్యా బాలయ్య టాక్ షో చేస్తున్నాడనగానే ఏం అనిపించింది అని అడగగా.. టాక్ షోలలో ప్రతీ సీజన్ కూడా మీరు వచ్చిన ఎపిసోడ్ నెంబర్ వన్ అని చెప్పాడు రానా. దానికి బాలయ్య కూడా పంచ్ వేసాడు. ఇక్కడ బాలకృష్ణ అంటేనే నెంబర్ వన్ అంటూ నవ్వేసాడు. కరోనా తో అందరూ మాయమైపోతే నువ్వెంటి పెళ్లి తో షాకిచ్చావ్ అనగానే, రానా అవునండి అన్ని చేసేసాను.. ఇక మిగిలింది పెళ్లే.. అందుకే పెళ్లి చేసుకున్నా అంటూ కామెడీ చేసాడు. రానా మీరు మీ వైఫ్ కి ఎన్నిసార్లు ఐ లవ్ యు చెప్పారు అని బాలయ్య ని అడగగానే నీకెందుకయ్యా అంటూ సెటైర్ వేసిన బాలకృష్ణ వెంటనే ఫోన్ తీసుకుని వసూ.. ఐ లవ్‌ యు అన్నారు. దానితో వసుందర గారు కూడా నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు అని అనేసారు. కోపం వచ్చినప్పుడు ఎవరు మీలో ముందు సారి చెబుతారు అని రానా బాలయ్య ని ప్రశ్న అడిగారు. దేనికైనా నేనే సారి చెబుతా. శ్రీకృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు నేనెంత అంటూ బాలయ్య ఫన్నీగా చెప్పుకొచ్చారు

Balakrishna says I love you to wife on Unstoppable:

Balakrishna - Rana Unstoppable Promo Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ