Advertisementt

NBK107 లో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజయ్

Mon 03rd Jan 2022 11:46 AM
duniya vijay,nandamuri balakrishna,gopichand malineni,mythri movie makers,nbk107  NBK107 లో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజయ్
Duniya Vijay On Board NBK107 NBK107 లో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజయ్
Advertisement
Ads by CJ

గత ఏడాది అఖండ మూవీ బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ కి ఊపు తీసుకువచ్చిన నందమూరి నట సింహం క్రాక్ సినిమాతో టాలీవుడ్ కు అద్భుతమైన హిట్‌ని అందించిన సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో NBK107 మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. #NBK107 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు.

మాస్‌ హీరో, మాస్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియ‌న్స్ కి ఫుల్‌ మీల్స్ అందించబోతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉంది. ఆ పాత్ర‌ను ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ చేయ‌నున్నారు. గోపీచంద్ మలినేని తన విలన్‌లను చాలా పవర్‌ఫుల్‌గా చూపించడంలో స్పెషలిస్ట్ కాబట్టి తెలుగులో నటుడికి ఇది సరైన ప్రారంభం అని చెప్ప‌చ్చు. దీంతో ఈ సినిమాలో బాలకృష్ణ, దునియా విజయ్‌ల మ‌ధ్య ఫైట్స్ ఏ రేంజ్ లో ఉండ‌బోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

బాలకృష్ణను మునుపెన్నడూ చూడని లుక్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. అలాగే ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించారు. గోపీచంద్ మలినేని అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా క‌థ‌ను రెడీ చేస్తుంటారు. అందుకే అతను బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందిస్తున్నాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Duniya Vijay On Board NBK107:

Duniya Vijay On Board For Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers NBK107  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ