Advertisementt

సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'

Mon 03rd Jan 2022 10:53 AM
senior hero rajasekhar,sekhar movie,sankranti 2022,rajasekhar sekhar movie,jeevitha rajasekhar  సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'
Rajasekhar Sekhar Joins Sankranthi Race 2022 సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'
Advertisement
Ads by CJ

ఎన్నడూ లేని విధంగా 2022 సంక్రాంతి రేస్ లో చిన్న సినిమాల ఊపుకనబడుతుంది. ఎప్పుడూ బిగ్ మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్ ఉండే సంక్రాంతి ఫైట్.. ఈసారి కరోనా వ్యాప్తి కారణముగా అవి డ్రాప్ అయ్యి.. చిన్న సినిమాలు లైన్ లోకి వచ్చాయి. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ విషయంలో వెనక్కి తగ్గడంతో.. యంగ్ హీరోలంతా ఒక్కసారిగా సంక్రాంతి ఫైట్ షురూ చేసారు. దాదాపుగా 8 సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. అందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా శేఖర్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ 91వ చిత్రంగా తెరకెక్కుతున్న శేఖర్ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

రీసెంట్ గా విడుదలైన శేఖర్ గ్లిమ్ప్స్ ఆ అంచనాలు మరింతగా పెంచేశారు. రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. స్ట‌యిలిష్‌గా స్మోక్ చేస్తూ రాజశేఖర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నట్లుగా శేఖర్ గ్లిమ్ప్స్ లోనే చూసాము. ఇక శేఖర్ మూవీ కి ఓటిటి ఆఫర్ కూడా వచ్చాయి. మంచి డీల్ తో శేఖర్ కోసం పెద్ద ఓటిటీలు పోటీ పడినా.. మేకర్స్ మాత్రం మా సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. ఓటిటి సంస్థలు వెనక్కి తగ్గాయి. అయితే ఇప్పుడు రాజశేఖర్ శేఖర్ మూవీ పొంగల్ బరిలో నిలిపే ప్రయత్నాలు మొదలయ్యాయని.. త్వరలోనే శేఖర్ రిలీజ్ డేట్ ప్రకటన కూడా రాబోతున్నట్లుగా టాక్. డేట్ ప్రకటించి ప్రమోషన్స్ లో వేగం పెంచాలనే ఆలోచనలో శేఖర్ మేకర్స్ ఉన్నారట. 

Rajasekhar Sekhar Joins Sankranthi Race 2022:

Senior Hero Rajasekhar Sekhar movie will going to be released this Sankranti

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ