ఇండస్ట్రీలో చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోలుగా మారిపోయారు. నాలుగు ఫ్యామిలీల నుండి వారసుల అరంగేట్రం, అలాగే కిందపడుతూ మీద పడుతూ ఎలాగో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొత్తగా ఇండస్ట్రీ నుండి మరికొంతమంది వారసుల ఎంట్రీ మొదలయ్యింది. టాలీవుడ్ బడా ఫ్యామిలీ నెఫ్యూస్ ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందులో దిల్ రాజు ఫ్యామిలీ నుండి దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ అంటూ రాబోతున్నాడు. అలాగే మరోలా డెబ్యూ హీరో.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో తో రాబోతున్నాడు. మరి ఈ వారసులంతా ఒకేసారి తలపడబోతున్నారు. సంక్రాంతి పోరులో ఈ వారసులు బరిలోకి దిగబోతున్నారు.
ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అవడంతో ఒక్కసారిగా యంగ్ హీరోలంతా తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అందులో దిల్ రాజు నెఫ్యూ, మహేష్ మేనల్లుడు ముందుగా అలెర్ట్ అయ్యారు. అశోక్ గల్లా హీరో జనవరి 14 న రిలీజ్ కి రెడీ అవగా... అదే 14 న కృష్ణం రాజు అన్న కొడుకు ప్రభాస్ రాధేశ్యామ్ తో పాన్ ఇండియా మార్కెట్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇక రౌడీబాయ్స్ అంటూ దిల్ రాజు నెఫ్యూ ఆశిష్ కూడా జనవరి 14 నే రాబోతున్నాడు. మరి ఈ సంక్రాంతి పోరులో ఉన్నవి చిన్నా, పెద్ద సినిమాలే అయినా.. ఈ సంక్రాంతి పోరు మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.