షణ్ముఖ్ కి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు బయట బాగా ప్రచారం చేసిన షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన.. బిగ్ బాస్ హౌస్ లో అతని ప్రవర్తన నచ్చక అతను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే.. కొన్ని రోజులు ఆగి మరీ బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. షణ్ముఖ్ - దీప్తి సునయన మధ్యన ఐదేళ్ల ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారింది. కానీ బిగ్ బాస్ హౌస్ వారి ప్రేమకి అడ్డుగా నిలిచింది. షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పిన దీప్తి సునయన కెరీర్ లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా చెబుతుంది. షణ్ముఖ్ - సిరి ఫ్రెండ్ షిప్ తనకి తప్పుగా అనిపించి ఉండవచ్చు అని అందుకే ఈ బ్రేకప్ అంటూ దీప్తికి కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
ఇక తాజాగా దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన రెండు రోజులకి సోషల్ మీడియాలో ఫాన్స్ తో చిట్ చాట్ చేసింది. ప్రశ్నలు అడగండి సమాధానాలు చెబుతా అంటూ మొదలు పెట్టింది. దీప్తికి అడుగడుగునా షణ్ముఖ్ బ్రేకప్ ప్రశ్నలే ఎదురయ్యాయి. అయితే దీప్తి కి ఎదురైన ప్రశ్నలకు దీప్తి సునయన లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకుని.. షణ్ముఖ్ తో బ్రేకప్ చాలా బాధ కలిగించింది. కానీ తప్పలేదు. ఇంతవరకు కెరీర్ గురించి ఆలోచించలేదు.. ఇకపై కెరీర్ లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నట్లుగా చెప్పి కన్నీటి పర్యంతమైంది.