చాలా పబ్లిక్ ఫంక్షన్స్ లో సీనియర్ నటులు అయిన చిరంజీవి మరియు మోహన్ బాబులు ఇద్దరు తాము గొప్ప స్నేహితులమని, తమ ఇద్దరు మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవని చెపుతూ వుంటారు. ఇవి కేవలం బయటకి చెప్పే మాటలా లేక నిజంగా ఇద్దరు మధ్య అంత స్నేహం లేదా? ఇది చాలామంది మదిలో వున్న ప్రశ్న కూడా. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగిన మా ఎన్నికల్లో ఈ ఇద్దరు నటులు రెండు గ్రూప్ లుగా విడిపోయి రెండు పానెల్స్ కి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి ఆంధ్ర ముఖ్యమంత్రి ని కలవడానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు ని పిలవలేదు అని మోహన్ బాబు వర్గం చాలా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈరోజు అంటే జనవరి రెండో తేదీన చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండస్ట్రీ లో వున్న అందరి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వడమనే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు.
ఇటువంటి సమయంలో మోహన్ బాబు ఒక పెద్ద విన్నపాన్ని తన సోషల్ మీడియా లో పెట్టారు. ఇండస్ట్రీ లో అందరు కలిసి రావాలని, ఎదో నలుగురు నిర్మాతలు, దర్శకులు, ఇంకా కొంత మంది నటులు రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులని, మంత్రులను కలవడానికి వెళ్లడం ఏంటి అని ప్రశ్నించారు. ముందు సినిమా రంగం లో వున్న అందరు సమస్యను చర్చించి, ఎలా అయితే ఆ సమస్య తీరుతుంది అని కూడా చర్చించి ఆ తరువాత మంత్రులని, ముఖ్య మంత్రులను కలవాలని చెప్పారు ఆ లేఖ లో. చిరంజీవి గారు ఏమైనా ఇండస్ట్రీ తరపున చేసినపుడు, మోహన్ బాబు ఇలా ఎదో ఒకటి వదులుతూ తాను కూడా వున్నాను అని చెప్పడానికా అన్నట్టు వుంటారు. అందుకే అందరి మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది, వీరిద్దరూ స్నేహితులా, శత్రువులా అని. లేక బయటకి స్నేహితుల్లో నటిస్తూ లోపల శత్రుత్వం పెంచుకుంటున్నారు అని.