చాలామంది నటుల వయస్సు మనకి గుర్తుండే ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ ఇంకా చాలామంది వయసు మనకి తెలుసు. అయితే ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న ఏంటంటే, రవి తేజ వయసు ఎంత ఉంటుంది అని. ఎప్పుడు ఎవరు అడిగినా ఆయన వయసు ఎవరికీ చెప్పరు. కరెక్ట్ వయసు తెలీదు కూడా. అయితే అదే రవి తేజ వయసు, ఆహా ఛానల్ సాక్షిగా బాలకృష్ణ బయటపెట్టేసారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో అడిగిన ఒక ప్రశ్నకి రవి తేజ సమాధానం ఇస్తూ తనకి ఫస్ట్ ఇంప్రెస్స్ చేసిన సినిమా హిందీ సినిమా షోలే అంట. అప్పటికి అతని వయసు తొమ్మిది సంవత్సరాలు అని చెప్పారు రవి తేజ.
అమితాబ్ షోలే రిలీజ్ అయిన సంవత్సరం మాత్రం 1975 లో. అంటే ఇప్పటికి 46 సంవత్సరాలు అయింది అన్నమాట. ఒకటి రెండు సంవత్సరాలు అటు ఇటు వేసుకున్నా, మీకు రవి తేజ వయస్సు ఇప్పుడు అర్థం అయిపోయి ఉంటుంది కదా. ఏది ఏమైనా అతని వయసు ఏభయి దాటినా కూడా అంతటి ఎనర్జీ తో పని చేస్తున్నాడు చూడండి.. అది నిజంగా హర్షించదగ్గ విషయం. చిరంజీవి గారు అరవయి అయిదు లో కూడా అలా డాన్స్ చేస్తున్నారు, అలాగే రవి తేజ కూడా ఏభయి అయిదు లో కూడా అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడు. మొత్తానికి రవి తేజ వయసు తెలిసిపోయింది. కానీ కనపడదు కదా అంత వయసున్నట్టు.