జనవరి 7 న రావాల్సిన క్రేజీ పాన్ ఇండియా మూవీ RRR వరల్డ్ వైడ్ గా థియేటర్స్ మూత బడడంతో.. ఉన్నట్టుండి కరోనా కారణంగా పోస్ట్ పోన్ అవడంతో.. లో బడ్జెట్, మీడియం బడ్జెట్ మూవీస్ అన్ని ముందుకు వచ్చేసాయి. చిన్న నిర్మాతలు, మీడియం నిర్మాతలు అందరూ అలెర్ట్ అయ్యారు. పొంగల్ రిలీజ్ లు అంటూ హడావిడి మొదలు పెట్టాడు. అందులో ముఖ్యంగా వరస సినిమాలతో జోరు చూపిస్తున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఆర్.ఆర్.ఆర్ డేట్ పై కచ్చిఫ్ వేశారు. ఆది నటించిన అతిధి దేవోభవ మూవీ ని జనవరి 7 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా.. మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ డేట్ ని ప్రకటించారు.
అంటే ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదల కావల్సిన జనవరి 7 ని ఆది సాయి కుమార్ ఆక్యుపై చేసి.. తన అతిధి దేవోభవ మూవీని రిలీజ్ కి రెడీ చేసేసారు. ఈ వారం రోజుల్లో వీలైనంతగా అథిదేవోభవ ప్రమోషన్స్ చేసి.. ప్రేక్షకుల ముందుకు వచ్చెయ్యాలని ఆది ప్లాన్. ఇక ఈ సినిమా తర్వాత ఆది సాయి కుమార్ వరస ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ఆది సాయి కుమార్ చేతిలో క్రేజీగా నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.