Advertisementt

ఇండస్ట్రీ పెద్ద: మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్

Sun 02nd Jan 2022 12:48 PM
megastar,chiranjeevi,sensational comments,cinema industry,tollywood,mohan babu,megastar chiru  ఇండస్ట్రీ పెద్ద: మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
MegaStar Chiranjeevi: I can not do such panchayats ఇండస్ట్రీ పెద్ద: మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద అనేది ఎవరూ లేకుండా పోయారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సేవ కార్యక్రమాలు, కరోనా టైం లో ఆయన తీసుకున్న స్టెప్స్, అలాగే చిన్న హీరోల పాలిట మెగాస్టార్ దిక్కుగా మారడంతో.. ఇండస్ట్రీకి పెద్ద మెగాస్టార్ చిరు నే అందరూ ఫిక్స్ అయ్యారు. అలాగే సినిమా ఇండస్ట్రీ సమస్యల కోసం చిరు ముందుకు రావడం, రెండు ప్రభుత్వాల సీఎం లతో మీటింగ్స్ ఇలా చాలా విషయాల్లో మెగాస్టార్ ముందు ఉండి నడిపించడంతో.. చిరుని ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటున్నారు. కానీ మోహన్ బాబు లాంటి వాళ్ళు చిరంజీవి ఇండస్ట్రీ కి పెద్ద అంటే ఒప్పుకోవడం లేదు. అయినా మెగాస్టార్ ఎప్పుడూ తనకి తాను పెద్దగా ప్రకటించుకోలేదు. అయినప్పటికీ ఆ విషయంలో చిరు ని కొందరు విమర్శిస్తున్నారు.

అయితే తాజాగా తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండదల్చుకోలేదు అని, ఆ పదవి తనకి వద్దు అంటూ మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సండే మెగాస్టార్ సినీ కార్మికుల హెల్త్ కార్డ్స్ పంపిణీలో పాల్గొనగా.. ఆ కార్యక్రమంలో సినిమా కార్మికులు చిరు ని ఓ కోరిక కోరారు. చాలా కాలంగా టాలీవుడ్ కి పెద్ద దిక్కు ఎవరూ లేరు.. ఆ బాధ్యత ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామంటూ విన్నవించుకున్నారు. మాకు ఏ సమస్య వచ్చినా మీరున్నారనే ధైర్యం మాకు ఉంటుంది అని అడిగారు. దానితో చిరు పెద్దరికం హోదా అనేది నాకిష్టం లేదు. నేను ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించను. ఆ పదవి వద్దు. ఏ పదవి లేకపోయినా నేను నా బాధ్యతను ఓ ఇండస్ట్రీ బిడ్డగా తీరుస్తాను. అందరి బాధ్యత తీసుకుంటాను. ఏ అవసరం వచ్చినా ముందుకు వస్తాను. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోను.. ఫర్ ఎగ్జామ్పుల్.. ఇద్దరి మధ్య తగువు అయినా, లేదంటే రెండు యూనియన్స్ మధ్యన తగవులు అయ్యి నా దగ్గరికి వచ్చి పంచాయితీ చెయ్యమంటే అస్సలు చెయ్యను.. కార్మికుల కోసం ఎల్లప్పుడూ నిలబడతాను అంటూ మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

MegaStar Chiranjeevi: I can not do such panchayats:

Megastar Sensational Comments on Cinema Industry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ