డిసెంబర్ మొదలైంది.. అఖండ మూవీ తో బాలకృష్ణ ఇండస్ట్రీకి అదిరిపోయే హిట్ ఇచ్చారు. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ మూవీ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. బిగ్ బడ్జెట్ మూవీ గా మళ్ళీ పెద్ద సినిమాలకి అఖండ కలెక్షన్స్ ఊపిరిపోసాయి. ఆ తర్వాత రెండు వారాలకి అల్లు అర్జున్ పుష్ప మూవీ తో హిట్ కొట్టాడు. పుష్ప సినిమా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. మిక్స్డ్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక డిసెంబర్ 24 న నాని శ్యామ్ సింగ్ రాయ్ అంటూ నాలుగు భాషల్లో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. శ్యామ్ సింగ్ రాయ్ సూపర్ హిట్ అవడంతో నాని ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు. నాని శ్యామ్ సింగ రాయ్ కి గనక ఆంధ్రలో థియేటర్స్ క్లోజ్ చెయ్యకపోయినా, లేదంటే టికెట్ రేట్స్ తగ్గించకపోయినా.. మేకర్స్ బోలెడన్ని లాభాలను గడించేవారు.
ఇక ఈ నెలలో మూడు భారీ హిట్స్ తో ఉన్న టాలీవుడ్ ఇయర్ ఎండ్ ని హిట్ తో ముగిస్తుందా? లేదంటే ప్లాప్ తో ముగిస్తుందా? అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఉన్నారు. ౨౦౨౧ ఏడాది చివరిలో శ్రీ విష్ణు అర్జున ఫాల్గుణ తో టాలీవుడ్ కి హిట్ ఇస్తాడా? ప్లాప్ ఇస్తాడా? అని ప్రేక్షకులు ఎదురు చూసారు. శ్రీ విష్ణు మాత్రం అర్జున్ ఫాల్గుణతో ప్లాప్ కొట్టి ఇయర్ ఎండ్ ని ముగించాడు. నిన్న శుక్రవారం రిలీజ్ అయిన అర్జున్ ఫాల్గుణకి ప్రేక్షకులు డివైడ్ టాక్ ఇవ్వడమే కాదు.. క్రిటిక్స్ కూడా పూర్ రేటింగ్స్ తో అర్జున ఫాల్గుణ ప్లాప్ అని తేల్చేసారు. శ్రీ విష్ణు యాక్టింగ్ తప్ప సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం లేదని, డైరెక్షన్, మ్యూజిక్, అలాగే ఎంటెర్టైనెంట్ అన్ని మిస్ అయ్యాయని అందుకే అర్జున్ ఫాల్గుణ కి డివైడ్ టాక్ వచ్చింది అంటున్నారు.
మరి డిసెంబర్ నెల మొత్తం హిట్స్ తో కళకళాడిన థియేటర్స్.. మంత్ ఎండ్, ఇయర్ ఎండ్ ప్లాప్ మూవీ తో డల్ గా ముగించాల్సి వచ్చింది.