రష్మిక - విజయ్ దేవరకొండ లు గీత గోవిందం టైం నుండే మంచి స్నేహితులు, ఆ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ మూవీలో కలిసి నటించేసరికి ఇద్దరి మధ్యన ఫ్రెండ్ షిప్ కాదు.. ఇంకేదో అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ.. ఒకేసారి పాన్ ఇండియా మూవీస్ మొదలు పెట్టినా రష్మిక నటించిన పుష్ప రిలీజ్ కూడా అయ్యింది. విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే లైగర్ కోసం విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబైలో ఉండడం, రష్మిక తన బాలీవుడ్ మూవీస్ కోసం తరచూ ముంబై రావడం.. అక్కడి నుండి విజయ్ దేవరకొండ - రశ్మికలు ఇద్దరూ డిన్నర్ డేట్స్ కి వెళ్లడం చేస్తున్నారు. దానితో వీరు లవర్స్ అని మీడియా ఫిక్స్ అయ్యింది.
ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ - రష్మిక ఇద్దరూ ఈ న్యూ ఇయర్ కోసం కలిసి గోవా వెళ్లారని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్మిక - విజయ్ దేవరకొండ ఇద్దరూ న్యూ ఇయర్ ని సెల్రబ్రేట్ చేసుకోవడం కోసం గోవా వెళ్లారని.. అక్కడి నుండి పిక్ పోస్ట్ చేసి.. ఫాన్స్ ని విష్ చేసారు అంటున్నారు. విడి విడిగా ఉన్న ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో కనిపించినా.. కలిసి ఉన్న ఫొటోస్ ఎక్కడా కనబడలేదు. మరి రష్మిక - విజయ్ ఇద్దరూ... Happy 2022 my loves.! అంటూ ఫాన్స్ ని స్పెషల్ గా విష్ చేసారు.