Advertisementt

అంటే సుందరానికీ..! చిత్ర జిరోత్ లుక్

Sat 01st Jan 2022 06:54 PM
nani,vivek athreya,mythri movie makers,ante sundaraniki movie,ante sundaraniki zeroth look unleashed  అంటే సుందరానికీ..! చిత్ర జిరోత్ లుక్
Nani Ante Sundaraniki Zeroth Look Unleashed అంటే సుందరానికీ..! చిత్ర జిరోత్ లుక్
Advertisement
Ads by CJ

శ్యామ్ సింగ రాయ్ తో అదిరిపోయే హిట్ కొట్టిన నాని తదుపరి మూవీ అంటే సుందరానికీ అప్ డేట్స్ స్టార్ట్ అయ్యాయి.  డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రంలో నాని డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా అంటే సుందరానికీ నుంచి జిరోత్ లుక్ పోస్టర్, వీడియోను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో నాని ఎర్ర చొక్క పంచె కట్టులో డిఫరెంట్ గెటప్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన లగేజీ బ్యాగ్ మీద హనుమాన్ బొమ్మ ఉంది. ప్రవర శ్లోకం చదువుతూ కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అని తన పేరును, హరితాస్య అనే గోత్రాన్ని చెప్పుకున్నారు సుందరం. వెంటనే వెల్ కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సుందరం అనే ఆహ్వానించారు.

ఈ 47 సెకన్ల వీడియో, పోస్టర్ తో సుందరం ప్రపంచం ఎంత సరదాగా, ఆహ్లాదకరంగా ఉండబోతుందో తెలుస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా అంటే సుందారినికీ సినిమా ఉంటుందని వీడియో ద్వారా అర్థమవుతోంది. నానికి ఈ సినిమా తప్పకుండా మరో డిఫరెంట్ మూవీ కానుంది. ఆవకాయ సీజన్ లో అంటే సమ్మర్ విడుదలకు అంటే సుందరానికీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వీడియోలో ప్రకటించారు.

అంటే సుందరానికీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది నజ్రియా నజిమ్ ఫహాద్. 

Nani Ante Sundaraniki Zeroth Look Unleashed:

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Zeroth Look Unleashed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ