Advertisementt

బంగార్రాజు టీజర్

Sat 01st Jan 2022 05:50 PM
bangarraju,bangarraju teaser,nagarjuna,naga chaitanya,krithi shetty,ramyakrishna,kalyan krishna  బంగార్రాజు టీజర్
Bangarraju Teaser blows all బంగార్రాజు టీజర్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త ఏడాది పండుగ సందర్భంగా బంగార్రాజు మూవీ టీజర్ ను విడుదల చేశారు. రొమాన్స్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ కలిసిన బంగాగ్రాజు టీజర్ అటు అక్కినేని అభిమానులే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

బంగార్రాజు క్యారెక్టర్ ఆత్మరూపంలో తిరిగి రావడంతో ఆసక్తికరంగా మొదలైన టీజర్..చిన్న బంగార్రాజు క్యారెక్టర్ లో నాగ చైతన్య చిలిపి చేష్టలతో ఎంటర్ టైనింగ్ గా మారింది. ఊరి సర్పంచ్ నాగలక్ష్మి (కృతి శెట్టి)ని ఇంప్రెస్ చేసేందుకు చిన్న బంగార్రాజు చేసే ప్రయత్నాలు, ఈ దేశానికే సర్పంచివి కావాలి అంటూ చెప్పే మాటలు నవ్వించాయి. రమ్యకృష్ణతో బంగార్రాజు చేసే రొమాన్స్ సోగ్గాడే చిన్ని నాయనా ను గుర్తుకుతెస్తుంది. గుడిలో ఆత్మగా బంగార్రాజు చేసే పోరాటాలు యమ ధర్మరాజు గ్రహించడం, లయకారుడి సన్నిధిలో అపశృతి కలి మాయకాకపోదు అంటూ చెప్పడం సీరియస్ నెస్ పెంచాయి. బంగార్రాజు, చిన్న బంగార్రాజు కలిసి నడుస్తూ రావడం ఫ్యాన్స్ కు ఫీస్టే అని చెప్పొచ్చు. ఇలా కమర్షియిల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ తో బంగార్రాజు టీజర్ అదిరిపోయింది.

Bangarraju Teaser blows all:

Nagarjuna Bangarraju Teaser release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ