Advertisementt

బ్రేకప్ పై షణ్ముఖ్ ఫస్ట్ రియాక్షన్

Sat 01st Jan 2022 02:09 PM
shanmukh,deepthi sunaina,siri,bigg boss,shanmukh responds,breakup  బ్రేకప్ పై షణ్ముఖ్ ఫస్ట్ రియాక్షన్
Shanmukh first reaction on breakup బ్రేకప్ పై షణ్ముఖ్ ఫస్ట్ రియాక్షన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ షణ్ముఖ్ కి 2021 లో బిగ్ బాస్ ఏమిచ్చిందో తెలియదు కానీ.. షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునయన మాత్రం ఆయనకి హ్యాండ్ ఇచ్చి బ్రేకప్ చెప్పేసింది. కారణం అందరికి తెలిసిన విషయమే. సిరి తో షణ్ముఖ్ స్నేహం నచ్చని దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షణ్ముఖ్ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ ని అన్ ఫాలో చెయ్యడం, అలాగే షణ్ముఖ్ ని కలకుండా ఉండిపోవడంతో అందరూ వీరికి బ్రేకప్ అవుతుంది అనుకున్నట్టుగానే దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది.

దీప్తి సునయన బ్రేకప్ చెప్పా చెప్పబోతోంది అన్నా షణ్ముఖ్ మాత్రం ఒప్పుకోలేదు. ఆమెని కన్విన్స్ చేస్తాను అని చెప్పాడు. కానీ దీప్తి సునయన బ్రేకప్ చెప్పడంతో షణ్ముఖ్ సైలెంట్ అయ్యాడు. అందరూ ఆసక్తిగా షణ్ముఖ్ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా షణ్ముఖ్ దీప్తి తో బ్రేకప్ పై స్పందించాడు. షణ్ముఖ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన లైఫ్ గురించి తాను డెసిషన్ తీసుకోవడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. దీప్తి నాకు ఐదేళ్లుగా సపోర్ట్ చేసింది అని.. అందుకు థాంక్స్ అని చెప్పిన షణ్ముఖ్.. కెరీర్ లో ఎప్పటికి.. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటాము అంటూ తన బ్రేకప్ పై షణ్ముఖ్ స్పందించాడు.

Shanmukh first reaction on breakup:

Shanmukh responds on his breakup

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ