2021 లో చిత్రపరిశ్రమకి ఎలా గడిచినా అంటే కరోనా పాండమిక్ తో కానివ్వండి, సెలబ్రిటీస్ మనల్ని వదిలిపోవడం కానివ్వండి.. ఏదైనా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. సినిమా పరిశ్రమ మళ్ళీ తిరిగి కోలుకుని నిలబడింది. 2021 ఇయర్ ఎండింగ్ లో మూడు భారీ హిట్స్ తో ఇండస్ట్రీ కళకళలాడింది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ మూవీస్ హిట్స్ తో 2021 ని సక్సెస్ ఫుల్ గా ముగించిన టాలీవుడ్ కోటి ఆశలతో 2022 లోకి అడుగుపెట్టింది. 2022 ఇయర్ స్టార్టింగ్ నుండి పాన్ ఇండియా మూవీస్ తో టాలీవుడ్ పుంజుకోబోతుంది. జనవరి మొదటి వారంలోనే ఆర్.ఆర్.ఆర్ అంటూ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ టాలీవుడ్ ని ఆనందనంత ఎత్తులో నించిబెట్టడానికి రెడీ అయ్యింది. తర్వాత వెంటనే ప్రభాస్ రాధేశ్యామ్ కూడా రాబోతుంది. మరి 2021 ఎలా గడిచినా.. 2022 అయినా టాలీవుడ్ కి మంచి జరగాలని కోరుకుంటూ.. సినీజోష్ మీకు సినీపరిశ్రమకు ప్రేక్షకులకి ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.