యూట్యూబర్, షార్ట్ ఫిలిం మేకర్ కం హీరో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కి 2021 ఎండ్ లో బిగ్ షాక్ ఇచ్చింది ఆయన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన. బిగ్ బాస్ సీజన్ 5 లోనే షణ్ముఖ్ క్రేజ్ పడిపోయింది. సిరి తో చేసిన స్నేహం వలన షణ్ముఖ్ కి బాగానే నెగిటివిటి వచ్చేసింది. షణ్ముఖ్ హౌస్ నుండి బయటికి వచ్చినప్పటినుండి షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేస్తున్నట్లుగా పోస్ట్ లు పెడుతుంది కానీ.. కం ఫర్మ్ చెయ్యలేదు. సోషల్ మీడియాలో షణ్ముఖ్ ని అన్ ఫాలో చేసింది, తర్వాత రకరకాలుగా పోస్ట్ లు పెట్టింది.
ఇక కొద్ది క్షణాల్లో 2021 కి బై బై చెప్పేసి.. 2022 కి వెల్ కం చెప్పే టైం లో దీప్తి సునయన షణ్ముఖ్ కి బిగ్ షాకిచ్చింది. 2022 కి వెల్ కం చెబుతూ షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. సోషల్ మీడియాలో దీప్తి సునయన షణ్ముఖ్ తో బ్రేకప్ విషయాన్ని నిర్దారించింది. ఇక తామిద్దరూ విడిపోతున్నట్టుగా ప్రకటించిన దీప్తి.. తాను షణ్ముఖ్ ఎంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇకపై ఎవరి దారిలో వారు ప్రయాణించాలని అనుకుంటున్నట్లుగా, తమకి ఇంతవరకు సపోర్ట్ చేసిన సన్నహితులకి, స్నేహితులకి థాంక్స్ చెబుతున్నట్టుగా పోస్ట్ పెట్టింది దీప్తి.. సో అఫీషియల్ గా షణ్ముఖ్ - దీప్తి సునయనకి మధ్యన బ్రేకప్ అయ్యి.. 2021 ఎండ్ కి బిగ్ బ్రేకింగ్ అయ్యింది.