Advertisement
TDP Ads

లాలా భీమ్లా.. అడవి పులి.. డిజే వెర్షన్

Fri 31st Dec 2021 08:25 PM
bheemla nayak,bheemla nayak dj version,pawan kalyan,rana,sagar k chandra,trivikram,nirthya menon,surya devara naga vamshi,sitara entertainment  లాలా భీమ్లా.. అడవి పులి.. డిజే వెర్షన్
Bheemla Nayak DJ version creates a sensation లాలా భీమ్లా.. అడవి పులి.. డిజే వెర్షన్
Advertisement

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

లాలా భీమ్లా…అడవి పులి... డిజే వెర్షన్ లో ఈ రోజు విడుదల అయిన భీమ్లా నాయక్ గీతం.

భీమ్లా నాయక్ చిత్రం నుంచి గతనెల 7 వ తేదీన ఇదే లాలా భీమ్లా అడవి పులి గీతం విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం.

2021 కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది.

భీమ్లా నాయక్ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారు ను కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

Bheemla Nayak DJ version creates a sensation:

Pawan Kalyan Bheemla Nayak DJ version creates a sensation

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement