Advertisementt

హీరో కానీ మేకర్స్ కానీ లేకుండానే.. ప్రమోషన్స్

Fri 31st Dec 2021 07:24 PM
radhe shyam,prabhas,radhe shyam poor promotions,pooja hegde,radhe shyam hindi promotions,uv creations  హీరో కానీ మేకర్స్ కానీ లేకుండానే.. ప్రమోషన్స్
Prabhas Radhe Shyam, Bad Promotions హీరో కానీ మేకర్స్ కానీ లేకుండానే.. ప్రమోషన్స్
Advertisement
Ads by CJ

సినిమా ప్రమోషన్స్ అంటే హీరో కానీ దర్శకుడు కానీ, నిర్మాతలు కానీ ఉంటేనే.. అప్పుడు ఆ సినిమాపై క్రేజ్ పెరుగుతుంది. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం తన సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నారో.. లేదంటే పాన్ ఇండియాలో బాహుబలి క్రేజ్ ఉంది.. ఇంకెందుకు సినిమాని ప్రమోట్ చెయ్యాలి అనుకున్నారో కానీ.. ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే రాధేశ్యామ్ మూవీ మేకర్స్, అలాగే ప్రభాస్ సైలెంట్ అయ్యారు. ఐదు భాషల్లో రాధేశ్యామ్ రిలీజ్ అవుతుంది. కానీ ఇంతవరకు హైదరాబాద్ లో తప్ప మరోచోట రాధేశ్యామ్ ప్రమోషన్స్ లేవు. సంక్రాంతికి అంటే జనవరి 14 న రాధేశ్యామ్ రిలీజ్ కాబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ముంబైలో చేస్తే బావుండేది అనేది ఫాన్స్ అభిప్రాయం.

కానీ ట్రైలర్ లాంచ్, రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్ని ఒకేసారి ఒకేచోట ఫాన్స్ చేతుల మీదుగా కానిచ్చేసి సైలెంట్ గా ఉండిపోయారు. మరో 14 రోజుల్లో మూవీ వచ్చేస్తుంది. కానీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ కోసం మేకర్స్ కానీ, ప్రభాస్ కానీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రభాస్ ఫాన్స్ మాత్రం ప్రభాస్ కానీ మేకర్స్ కానీ లేకపోయినా మ్యూజికల్ కాంటెస్ట్స్ అంటూ వైజాగ్ నుండి హంగామా మొదలు పెట్టారు. వాన్స్ మీద రాధేశ్యామ్ పోస్టర్స్ వేసి ప్రచారం చేస్తున్నారు.. వాటిని పీఆర్వో లు పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప.. రాధేశ్యామ్ టీం లో కదలిక లేదు. ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా ఏదో ఒక సిటీ లో రాధేశ్యామ్ ప్రెస్ మీట్స్ అయినా పెడితే బావుండేది అంటూ ప్రభాస్ ఫాన్స్ కూడా ఫీలవుతున్నారు. మరి ఈ 14 రోజుల్లో ఎమన్నా ప్లాన్ చేశారేమో చూడాలి. 

Prabhas Radhe Shyam, Bad Promotions:

Radhe Shyam Poor Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ