రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ మరో వారం రోజుల్లో ఐదు భషాల్లో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతుంది. పాన్ ఇండియా మూవీ అంటే.. అదే రేంజ్ ప్రమోషన్స్ ఉండాలి అనేది రాజమౌళి ప్లాన్. అందుకే ఆర్.ఆర్.ఆర్ కి ఎక్కడెక్కడ, ఎన్ని చోట్ల, ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ చెయ్యాలని అని ప్లాన్ చేసుకుని మరీ రంగంలోకి దిగిపోయారు. డిసెంబర్ 9 వ తారీఖు నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రాజమౌళి.. స్టిల్ ఇప్పటివరకు ఇంకా ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. మరి తన హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ ని వేసుకుని నిర్మాత దానయ్యతో రాజమౌళి ఇవ్వాళ చెన్నై లో ఉంటే.. సాయంత్రానికి ముంబై, ఉదయం బెంగుళూరులో ఉంటే.. సాయంత్రం హైదరాబాద్ అంటూ ప్రవేట్ జెట్ వేసుకుని సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. హిందీ ప్రమోషన్స్ కోసం ఓ వారం రోజుల పాటు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, దానయ్యలు ముంబైలోనే ఉన్నారు.
ఇక ప్రముఖ సిటీస్ లో ప్రెస్ మీట్స్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అలాగే ఆయా భాషల్లో పాపులర్ అయిన షోస్ కి ఇంటర్వూస్ అబ్బో చాలా ఖర్చు పెట్టేస్తున్నారు. మరి హీరోలకి హోటల్ రూమ్స్, అలియా భట్ కి ఫ్లైట్ టికెట్స్, ప్రవేట్ జెట్ ఖర్చు మాములుగా ఉండదు. మరి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి దానయ్య అక్షరాలా 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి ఇంతుండాలి, ప్రమోషన్స్ ఇలానే ఉండాలి, అలాంటప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది అని రాజమౌళి చెప్పడం, 20 కోట్ల బడ్జెట్ వేసుకుని దానయ్య రెడీ అవ్వడంతోనే.. ఫుల్ స్వింగ్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ జరుగుతూన్నాయట.