Advertisementt

ఖిలాడి నుండి అట్టా సూడ‌కే.. సాంగ్ రిలీజ్

Fri 31st Dec 2021 03:41 PM
mass maharaja ravi teja,ramesh varma,satyanarayana koneru khiladi third song atta sudake lyrical out  ఖిలాడి నుండి అట్టా సూడ‌కే.. సాంగ్ రిలీజ్
Khiladi Third Song Atta Sudake Lyrical Out ఖిలాడి నుండి అట్టా సూడ‌కే.. సాంగ్ రిలీజ్
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేష‌న్ లో రాబోతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఖిలాడీ చిత్రాన్ని సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రొడ‌క్ష‌న్ చివ‌రిద‌శ‌లో ఉంది.

ఈ మూవీ మ్యూజిక్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూడవ‌పాట‌  అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికేను విడుద‌ల‌చేశారు.  దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేయ‌డంతో పాటు సింగర్ సమీరా భరద్వాజ్ తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి లిరిసిస్ట్ శ్రీమణి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సాహిత్యం రాశారు.

అట్టా సూడకే పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ - మీనాక్షి చౌదరీ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పుల‌తో  అదరగొట్టారు.

నిర్మాత‌లు ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది.

బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ  రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది.

Khiladi Third Song Atta Sudake Lyrical Out:

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru Khiladi Third Song Atta Sudake Lyrical Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ