గాలి సంపత్ ప్లాప్ తర్వాత శ్రీ విష్ణు రాజా రాజా చోర సినిమాతో హిట్ కొట్టాడు. రాజా రాజా చోర కామెడీ హిట్ అవడంతో.. విష్ణు నటించిన తదుపరి సినిమా అర్జున ఫల్గుణ పై అంచనాలు ఏర్పడ్డాయి. అర్జున ఫల్గుణ మూవీ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కినట్లుగా, కామెడీ ఎంటర్టైనర్ గా ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి 2021 ఇయర్ ఎండింగ్ లో వీక్ ప్రమోషన్స్ తో థియేటర్స్ లోకి దిగిన శ్రీ విష్ణు అర్జున్ ఫల్గుణ సినిమాకి ఓవర్సీస్ లో షోస్ పడడము.. అప్పుడే ఓవర్సీస్ ప్రేక్షకులు టాక్ స్ప్రెడ్ చెయ్యడం జరిగిపోయింది. మరి శ్రీ విష్ణు అర్జున ఫల్గుణ ఎలా ఉందో ఓవర్సీస్ ప్రేక్షకుల మాటల్లో..
అర్జున ఫాల్గుణ మూవీ అంతా గంజాయి కేసులో ఇరుక్కున్న ఫ్రెండ్స్ కథగా ఉంది అని, సినిమాలో శ్రీ విష్ణు తప్ప చెప్పుకోదగిన బలమైన సన్నివేశాలు కానీ, చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ కానీ లేవంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ ఏది ఆకట్టుకునేలా లేదు అని, తేజ మర్ని డైరెక్షన్ కానీ, ఎంచుకున్న కథ కానీ.. ఏది ఇంట్రెస్టింగ్ గ లేవని, కథలో కామెడీ బలవంతంగా ఇరికించడం, పసలేని సన్నివేశాలు.. అన్ని కలిపి అర్జున్ ఫల్గుణకి మైనస్ లుగా చెబుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా అనిపించినా.. కామెడీ కూడా ఆకట్టుకునేలా లేదు అని, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండూ బోర్ కొట్టించాయని అంటున్నారు. శ్రీ విష్ణు తప్ప సినిమాలో చెప్పుకోదగిన అంశాలే లేవన్నట్టుగా ఓవర్సీస్ ప్రేక్షకులు అర్జున్ ఫల్గుణపై పెదవి విరుస్తున్నారు.