ఈమధ్య మూడు బిగ్ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ అఖండ, అల్లు అర్జున్ పుష్ప, నాని శ్యామ్ సింఘ రాయ్. ఈ మూడు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాగా ఆడుతున్నాయన్న టాక్ కూడా వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ కూడా రిలీజ్ కి రెడీ గా వుంది. ఒక్క అఖండ తప్పితే, మిగతా మూడు సినిమాలు ఎక్కువ ఫంక్షన్స్ తెలంగాణ లోనే పెట్టారు. శ్యామ్ సింఘ రాయ్ అయితే ప్రమోషన్స్ కోసం కనీసం ఆంధ్ర ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పుష్ప కూడా ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్స్ అన్ని కూడా తెలంగాణ లోనే పెట్టారు. అలాగే పుష్ప, శ్యామ్ సింఘ రాయ్ లో నటించిన నటీనటులు కూడా మిగతా భాషల్లో ప్రమోట్ చెయ్యడానికి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్లారు. కానీ వీళ్ళకి ఆంధ్ర లో ప్రమోట్ చెయ్యడానికి అస్సలు టైం దొరకలేదు. ఎంత విచిత్రం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ తగ్గించిందని వీళ్ళకి కోపమా ఏంటి? నాని అయితే ఓపెన్ గానే ఆంధ్ర ప్రభుత్వాన్ని విమర్శించారు కదా. అందుకనే అస్సలు ఆంధ్రాకి వెళ్ళలేదు. కానీ ఏమైనా ఆంధ్ర కలెక్షన్స్ కూడా సినిమా సక్సెస్ కి సగం కారణం అవుతాయి కదా. ఆర్ ఆర్ ఆర్ టీం కూడా అన్ని ప్రాంతాలు వెళుతున్నారు కానీ.. ఆంధ్ర మాత్రం వెళ్లడం లేదు. ఇదేం విచిత్రమో తెలియడం లేదు. మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉంటే ఉండవచ్చు కానీ, అక్కడ ప్రేక్షకులు కాదు కదా. చాలామంది స్టార్స్ కి ఆంధ్ర లో విపరీతమయిన ఫాలోయింగ్ వుంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు ఈ విషయం మీద దృష్టి పెట్టడం లేదు.