Advertisementt

బిగ్ బాస్5 గ్రాండ్ ఫినాలేకి అదిరిపోయే రేటింగ్

Thu 30th Dec 2021 06:58 PM
bigg boss 5,bigg boss finale,tremendous response,nagarjuna,big boss grand finale,star maa  బిగ్ బాస్5 గ్రాండ్ ఫినాలేకి అదిరిపోయే రేటింగ్
Bigg Boss 5 finale sensation: Nagarjuna thanks all బిగ్ బాస్5 గ్రాండ్ ఫినాలేకి అదిరిపోయే రేటింగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయినప్పటి నుండే చాలా చప్పగా.. చాలా నీరసంగా ఏదో అయ్యింది అనిపించారు. నాగార్జున శని, ఆదివారం ఎపిసోడ్స్ తప్ప ఏది కూడా ఈ సీజన్ ఆకట్టుకునేలా లేదు. కంటెస్టెంట్స్ లో ఆ సిరి - షణ్ముఖ్ ల రొమాన్స్ తట్టుకోలేక టివిలు కూడా కట్టేసారు అంటే నమ్మాల్సిందే అయితే బిగ్ బాస్ సీజన్ 5 నడిచిన 105 డేస్ లో మధ్యలో దివాళి, దసరా సెలెబ్రేషన్స్ అంటూ ఆ ఎపిసోడ్స్ లో సెలెబ్రెటీస్ రాక, హీరోయిన్స్ డాన్స్ పెరఫార్మెన్స్, అలాగే సినిమా ప్రమోషన్స్ తో కళకళలాడింది. ఇక ఫైనల్ గా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా ఈసారి స్టార్ మా కొత్తగా ఫినాలే ఎపిసోడ్ ని సెలెబ్రేట్ చేసింది.

గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో అలాంటి ఇలాంటి సెలబ్రిటీస్ కాదు.. బాలీవుడ్ నుండి రణబీర్ కపూర్, ఆర్యన్ ముఖర్జీ, అలియా భట్ లతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై నించోబెట్టేసరికి.. ఈ ఎపిసోడ్ పై ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. తర్వాత రాజమౌళి, నాగ చైతన్య, జగపతి బాబు, ఇంకా నాని శ్యామ్ సింగ రాయ్ హీరోయిన్స్, అలాగే జాతిరత్నాలు హీరోయిన్, శ్రియ డాన్స్ పెరఫార్మెన్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హడావుడితో ఫైనల్ విన్నర్ ని నాగార్జున రివీల్ చేసి అందరిలో ఆ ఎపిసోడ్ పై అంచనాలు ఆశక్తి కలిగించారు. అందుకే స్టార్ మా కి బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి అదిరిపోయే టీఆర్పీ వచ్చింది. ఏకంగా ఆ ఎపిసోడ్ కి 18.4 టీఆర్పీ తో స్టార్ మా అదరగొట్టేసింది. నాగార్జున కూడా 4.30 నిమిషాల బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి 18.4 టీఆర్పీ రావడంతో బుల్లితెర ప్రేక్షకులకి థాంక్స్ చెప్పారు.  

Bigg Boss 5 finale sensation: Nagarjuna thanks all:

Bigg Boss 5 finale gets a tremendous response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ