ఇదే మాట ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్న వార్త. ఎందుకంటే ఇప్పటి పరిస్థితులు బట్టి ఆ సినిమా కనక రిలీజ్ అయితే, నిర్మాతకి గిట్టుబాటు కాదు అని ఒక వాదన. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ పెంచడం మీద ఒక కమిటీ వేశారు. అక్కడ సినిమా పరిశ్రమ నుండి కొంతమంది పెద్దలు బ్యాక్ డోర్ నుండి వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యే టైం కి అక్కడ టికెట్ రేట్ మారితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఒకవేళ టైం పడితే మాత్రం, ఆర్ ఆర్ ఆర్ కూడా రిలీజ్ పోస్టుపోన్ అవ్వొచ్చు అన్న మాట చక్కర్లు కొడుతోంది.
దీనికి తోడు నార్త్ లో పరిస్థితి కూడా రిలీజ్ కి అనుకూలంగా లేదు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం గా చెప్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ ధర పెంచడానికి ఏపీ ప్రభుత్వం వొప్పుకోడానికి సిద్ధం అయింది అంటున్నారు. కానీ ఎప్పటి నుండి అన్నది ఇంకా తెలియదు. ఈ పరిస్థితుల్లో రాజమౌళి ఏమి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. నిర్మాత దానయ్యే అయినా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాజమౌళినే తీసుకోవాలి.