రాబోయే రెండు వారాల్లో రెండు పెద్ద తెలుగు సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ రిలీజ్ అవబోతున్నాయి. అయితే ఈ రెండు పెద్ద బడ్జెట్ సినిమాలు అవటం మాత్రమే కాదు పాన్ ఇండియా గా రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ దగ్గరపడే కొద్దీ రెండు సినిమాల నిర్మాతలకి రోజు రోజుకి టెన్షన్ బాగా పెరిగిపోతోంది. ఎందుకంటే టికెట్ రేట్స్ ఒక పక్క, మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆంక్షలు పెడుతుందో అని. ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయిగా మరి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కరు మాత్రం హ్యాపీగా వున్నారు, తన సినిమా రిలీజ్ గురించి.
ఆయనే నాగార్జున. ఎందుకంటే నాగార్జునకి ఈ పాన్ ఇండియా, టికెట్ రేట్ గొడవ ఏమి అక్కరలేదు. తన సినిమా రెండు స్టేట్స్ లో మామూలుగా రిలీజ్ అయితే చాలు. పండగకి ఇక్కడ రెండు రాష్టాల్లో ప్రజలు సినిమా చూస్తారు. పెద్ద బడ్జెట్ ఏమి లేదు. రెండు వారాలు బాగా ఆడితే చాలు. భారీ రిలీజ్ కూడా లెదు. అందువల్ల ఏమి టెన్షన్ లేకుండా తన బంగార్రాజు సినిమాని పండగకి హాయిగా రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నారు నాగార్జున. ఈ సినిమా నిర్మాత కూడా నాగార్జున కావటం మరింత బలం. పెద్ద కొడుకు చైతన్య కూడా ఇందులో ఇంకో లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్. జనవరి 15 న రిలీజ్ అన్నారు.. అదే డేట్ కి వస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ తో సంక్రాంతికి హిట్ కొట్టాలనే హుషారులో నాగార్జున కనిపిస్తున్నారు.