రీసెంట్ గా పుష్ప సక్సెస్ మీట్ పెట్టారు. అయితే అది ఆడియన్స్ కి థాంక్స్ చెప్పటానికి కాదు, వాళ్ళ టీం మెంబెర్స్ కి వాళ్ళు థాంక్స్ చెప్పుకునే సమావేశం. అంతే. అయితే ఇందులో ఒక విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా లో స్క్రీన్ మీద కన్నా, ఆరోజు థాంక్స్ మీట్ లో మాత్రం తన నటన విశ్వరూపం చూపించాడు అంటున్నారు. తాను సినిమాలోనే కాదు, రియల్ గా కూడా బాగా నటిస్తా అని అల్లు అర్జున్ పుష్ప థాంక్స్ మీట్ లో నిరూపించాడు. ఆమధ్య ఒక రాజకీయ నాయకుడు ఏడిస్తే, కొందరు తప్పు బట్టారు. మగాళ్లు ఏడవకూడదు, అతను సీన్ చేసాడు అని.
మరి అల్లు అర్జున్ గారు కూడా కంట తడి పెట్టారు కదా. ఇతని ఏడుపు ఏమో ఎమోషనల్ గా వచ్చిందా? అయినా అదేంటండి బాబు, తనకి తాను గొప్పలు చెప్పుకోవటం ఎక్కడైనా చూసామా? వేరే వాళ్ళు మన గురించి చెప్పాలి, అంతే గాని, నాకో ఆర్మీ వుంది, అది వుంది, ఇది వుంది, నేనో ఐకాన్ స్టార్ అని ఒక మోస్తరుగా ఏకరవు పెట్టాడు అల్లు అర్జున్. సుకుమార్ లేకపోతే తాను లేను అని ఏవేవో చెప్పారు. మరి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమయినట్టో. అతనితో మూడు సినిమాలు చేసాడు కూడా. త్రివిక్రమ్ చూపించినంత స్టైల్ గా ఇంకే డైరెక్టర్ అల్లు అర్జున్ ని చూపెట్టలేదు. ఏమైనా కూడా మగాడు నలుగురి ముందు కంట తడి పెడితే బాగొదండి. ఓవర్ యాక్టింగ్ అంటారు. పుష్ప హిట్ అయ్యిందో.. లేదో.. కానీ, అల్లు అర్జున్ మాత్రం బాగా హిట్ అయిపోతున్నాడు.