ప్రభాస్ - రాజమౌళి బాహుబలి తో పాన్ ఇండియా ని చుట్టేశారు. బాహుబలి మూవీ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా కోసం ఐదేళ్లు పడిన శ్రమ కి ప్రేక్షకులు ఇచ్చిన గుర్తింపు అసమాన్యమైనది. ప్రభాస్ అప్పటి నుండి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని మాత్రమే ఒప్పుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సంగతి ఎలా ఉన్నా.. బాహుబలి తర్వాత మరో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టేయ్యడానికి రెడీ అయ్యాడు. ఆయన ఏ భాషలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ చేసినా.. బాహుబలి రాజమౌళి అంటూ ఆయన్ని కొలుస్తున్నారు. రాజమౌళికి ఇంకా బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
కానీ ప్రభాస్ కి ఇంకా ఆ క్రేజ్ ఉందా? అంటే సాహో తో ప్రభాస్ అంతగా సత్తా చాటలేకపోయాడు. బాహుబలిలా అన్ని భాషల ప్రేక్షకులని పలకరించలేకపోయాడు. సాహో కి ప్రెస్ మీట్స్ పెట్టలేదు, అలాగే ఇంటర్వూస్ ఇవ్వలేదు. కానీ బాహుబలి మ్యానియాతో ప్రభాస్ సాహో విషయంలో గట్టెక్కేసాడు. కానీ రాధేశ్యామ్ కి ప్రభాస్ బాహుబలి మ్యానియా పనికొస్తుంది.. అదే ఆడేస్తుంది అనుకుంటున్నట్లుగా ఉంది వ్యవహారం. ఏదో ఓ నేషనల్ ఈవెంట్ అంటూ హడావిడి చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో.. రాధే శ్యామ్ ఇంటర్వూస్, అలాగే ఐదు భాషల ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ కామ్ గా ఉన్నాడు.
మరి ఇక్కడ కూడా సాహో లా బాహుబలి క్రేజ్, ఆ మ్యానియా పనికొస్తుంది అనుకుంటున్నాడా? అసలు రాధే శ్యామ్ మేకర్స్ కూడా అంతే.. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్నా.. వారిలో చలనం లేదు. అటు చూస్తే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ జాడ కనిపించడం లేదు.