కరోనా సెకండ్ వేవ్ తగ్గాక సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా.. మహారాష్ట్రలో కఠిన నిబంధనలతో థియేటర్స్ లో అక్టోబర్ వరకు 50 పర్సెంట్ అక్యుపెన్సీతో నడిపించారు. నవంబర్ నుండి థియేటర్స్ ఓపెన్ కావడంతో అక్షయ్ కుమార్ సూర్యవంశీ తో దిగిపోయి హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ రణ్వీర్ సింగ్ 83 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతా సర్దుకుంది అనుకుంటున్న టైం లో మళ్ళీ బాలీవుడ్ పైనే కాదు.. అన్ని భాషల థియేటర్స్ పై పిడుగుపడింది. అదే కరోనా థర్డ్ వెవ్, ఓమ్రికాన్ వేరియెంట్ మరోసారి సినిమా ఇండస్ట్రీపై బాంబు వేసింది. కరోనా థర్డ్ వెవ్ ఎఫెక్ట్ తో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతుంటే.. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతో పాటుగా థియేటర్స్ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ విధించింది ప్రభుత్వం. మరోపక్క ఢిల్లీ లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం.
దానిలో భాగంగా థియేటర్స్, స్కూల్స్, మల్టిప్లెక్స్ లు అన్ని మూతపడ్డాయి. దానితో బాలీవుడ్ మరోసారి వెనకడుగు వేసింది. అంటే హిందీలో రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్ ని వాయిదా వేసుకుంది. రణ్వీర్ సింగ్ 83 రిలీజ్ అయిన కొద్దీ రోజులకే నైట్ కర్ఫ్యూలు పెట్టడంతో.. హిట్ టాక్ తెచ్చుకున్న 83 మూవీ కలెక్షన్స్ పై గట్టి దెబ్బ పడింది. ఓవర్సీసీ లో డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 83 కి ముంబై లాంటి సిటీస్ లో అనుకున్నకలెక్షన్స్ రాలేదు. దానితో మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న షాహిద్ కపూర్ జెర్సీని వాయిదా వేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వలో షాహిద్ కపూర్ చేసిన తెలుగు జెర్సీ రీమేక్ జెర్సీ ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు.
ఆ తర్వాత విడుదల కాబోయే ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు పరిస్థితి ఏమిటో జనవరి 2 తర్వాత తెలుస్తుంది అంటున్నారు.