Advertisementt

సిరి - షన్ను పై ట్రోల్స్ వద్దు: సన్నీ

Tue 28th Dec 2021 11:30 AM
bigg boss 5,bigg boss telugu,siri,shanmukh,negative trolls,bigg boss winner sunny,sunny interview  సిరి - షన్ను పై ట్రోల్స్ వద్దు: సన్నీ
No trolls on Siri-Shanmukh: Sunny సిరి - షన్ను పై ట్రోల్స్ వద్దు: సన్నీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో ఎవరు ఎంతగా హైలెట్ అయ్యారో తెలియదు కానీ.. సిరి - షణ్ముఖ్ లు మాత్రం ఓ విధంగా బాగా హైలెట్ అయ్యారు. బిగ్ బాస్ బయట గర్ల్ ఫ్రెండ్ ఉన్న షణ్ముఖ్, అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లేముందు శ్రీహన్ ని ఎంగేజ్మెంట్ చేసుకున్న సిరి లు బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్ షిప్ అంటూ విచ్చల విడిగా ముద్దులు, హగ్గులతో చెలరేగిపోయారు. సైలెంట్ గా, టాస్క్ లలో వీక్ గా వున్న షణ్ముఖ్ సిరిని కంట్రోల్ చెయ్యడానికే టైం సరిపోలేదు. సిరి యాక్టీవ్ గా అందరితో కలిసినా షణ్ముఖ్ ఊరుకోడు. సిరి తన హాండ్స్ నుండి ఎక్కడ జారిపోతుందో అని షణ్ముఖ్, షణ్ముఖ్ ఎక్కడ హార్ట్ అవుతాడో అని సిరి, ఇద్దరూ ఎమోషనల్ గా బుల్లితెర ప్రేక్షకులతో ఆడుకున్నారు.

అయితే వారిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన పనికి బయట చాలా ట్రోల్స్ నడిచాయి. ఆఖరికి షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ కూడా షణ్ముఖ్ తో బ్రేకప్ చేసుకోబోతుంది. ఇక సిరి - శ్రీహన్ కలిసి ఇంతవరకు బయట కనిపించలేదు. అంతగా సిరి, షణ్ముఖ్ లు నెగెటివ్ గా అయ్యారు. అయితే బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన సన్నీ మాత్రం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి, నేను మానస్ తో ఎలాంటి స్నేహం చేసానో.. సిరి - షణ్ముఖ్ ల స్నేహం అలాంటిది. అక్కడ అమ్మాయి - అబ్బాయి అనే తేడా తప్ప.. వాళ్ళని ట్రోల్స్ తో నెగెటివ్ చెయ్యకండి, ప్లీజ్ అందరికి చెబుతున్నా వాళ్ళకి మంచి కెరీర్ ఉంది.. వాళ్ళని ట్రోల్స్ తో, నెగెటివ్ గా ఇబ్బంది పెట్టకండి అంటూ తాను ఇస్తున్న ఇంటర్వూస్ లో రిక్వెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

No trolls on Siri-Shanmukh: Sunny:

Bigg Boss 5 Siri About Negative Trolls

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ