Advertisementt

కరోనా తో ఫ్రెండ్స్ ని కోల్పోయిన హీరోయిన్

Tue 28th Dec 2021 10:25 AM
shruti haasan,father kamal haasan,kamal recovery,covid-19,shruti haasan friends  కరోనా తో ఫ్రెండ్స్ ని కోల్పోయిన హీరోయిన్
Dad was super safe but still contracted Covid: Shruti Haasan కరోనా తో ఫ్రెండ్స్ ని కోల్పోయిన హీరోయిన్
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి భార్య నుండి భర్తని, భర్త నుండి భార్యని, అమ్మ నాన్నలని, అక్క తమ్ముళ్ళని, అన్నాతమ్ముళ్ళని, ఫ్రెండ్స్ ని ఒకరికి ఒకరిని కాకుండా చేసింది. ఫస్ట్ వెవ్, సెకండ్ వేవ్ లలో బోలెడంత మంది సెలబ్రిటీస్ ని కరోనానే తీసుకుపోయింది. అయితే ఇప్పుడొక హీరోయిన్.. కరోనా కారణంగా చాలామంది స్నేహితులని పోగొట్టుకున్నాను అని చెబుతుంది. ఆమె క్రాక్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ కొట్టిన శృతి హాసన్. బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ ఆఫర్స్ అంటూ కెరీర్ ని ప్రమాదంలో పడేసుకుని, మళ్ళీ క్రాక్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన శృతి హాసన్ కరోనాని  లైట్ తీసుకోవద్దని చెబుతుంది.

శృతి హాసన్ కరోనా మహమ్మారి గురించి మట్లాడుతూ.. ఈమధ్యనే మా నాన్నగారు కమల్ కరోనా బారిన పడి కోలుకున్నారు.. లక్ బావుంది త్వరగానే కోలుకున్నారు. అలా అని చెప్పేసి కరోనాను తక్కువగా అంచనా వేయవద్దు. కరోనా వైరస్ చాలా ప్రమాదకారి, కరోనా కారణంగా నేను కొంత మంది స్నేహితులను కోల్పోయాను.. ఫ్రెండ్స్ ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం, ఆ టైం లో నేను చాలా బాధని అనుభవించాను.. అందుకే కరోనా ని తక్కువగా అంచనా వెయ్యొద్దు.. మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ చెబుతుంది శృతి హాసన్. ఇక ప్రస్తుతం శృతి హాసన్ బాలయ్య NBK107 లో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ప్రభాస్ తో సలార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తుంది.

Dad was super safe but still contracted Covid: Shruti Haasan:

Shruti on her father Kamal Haasan recovery from Covid-19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ