నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సమంత.. రెండు నెలలు ఏదో కోల్పోయిన బాధ నుండి తేరుకుంది. ఊ అంటావా మావా ఉ ఊ అంటావా మావా అంటూ ఐటెం సాంగ్ లో ఊపేసిన సమంత.. రీసెంట్ గా యశోద మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసింది. అలాగే నెక్స్ట్ మూవీస్ కి రెడీ అవ్వబోతుంది. ఇంకా ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ తో మరో హిందీ వెబ్ సీరీస్ కి సమంత ఓకె చెప్పింది అంటున్నారు. పెళ్లి తర్వాత సమంత కెరీర్, విడాకుల తర్వాత సమంత కెరీర్ అన్నట్టుగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. మరోపక్క NTR30 లో సమంత హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్.
అయితే సమంత పెళ్లి తర్వాత బికినీ షోస్ తో తగ్గేదే లే అంటూ సోషల్ మీడియాలో ఎలా రెచ్చిపొయిందో.. విడాకుల తర్వాత కూడా ఎక్కడా తగ్గేదే లే అంటుంది. నాగ చైతన్య తో పెళ్లి అయ్యాక కూడా ఫాన్స్ బెదిరింపులకు బెదరని సమంత.. డివోర్స్ తర్వాత ఎందుకు తగ్గుతుంది. ప్రస్తుతం క్రిష్టమస్ సెలెబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి చెక్కేసింది. గోవాలో సమంత బికినీ తో ఛిల్ అవుతుంది. సమంతకి బికినీ వెయ్యడం కొత్తకాదు, సోషల్ మీడియాలో బికినీ ఫొటోస్ పోస్ట్ చెయ్యడము కొత్త కాదు.. కానీ డివోర్స్ తర్వాత సమంత మళ్ళీ తేరుకుని పాత సమంత లా ఛిల్ అవుతూ ఎంజాయ్ చెయ్యడమే కొత్తగా అనిపిస్తుంది.