Advertisementt

మహేష్ - త్రివిక్రమ్: ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్

Mon 27th Dec 2021 08:26 PM
mahesh babu,trivikram,mahesh-trivikram,dubai,rajamouli,producer naga vamsi,music director thaman  మహేష్ - త్రివిక్రమ్: ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting News On Mahesh Babu - Trivikram Combo SSMB28 మహేష్ - త్రివిక్రమ్: ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం మోకాలి సర్జరీ చేయించుకుని దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడే ఆయన తన కూతురు సితార, కొడుకు గౌతమ్, భార్య నమ్రత తో క్రిష్టమస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మహేష్ ని భీమ్లా నాయక్ షూటింగ్ లో బిజీగా వున్న త్రివిక్రమ్ కలవడం హాట్ టాపిక్ అయ్యింది. భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ అంటే.. త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండేవారు. కానీ భీమ్లా నాయక్ రిలీజ్ ఫిబ్రవరికి మారడంతో త్రివిక్రమ్ ఫ్రీ అయ్యారు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ దుబాయ్ కి వెళ్లి మహేష్ ని కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మహేష్ సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తోనే SSMB28 చెయ్యబోతున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా త్రివిక్రమ్ తో వెళ్లి మహేష్ ని కలిశారు. త్రివిక్రమ్ తో మహేష్ కూల్ గా కథా చర్చల్లో పాల్గొన్నట్టుగా పిక్స్ షేర్ చేసి Work and chill…productive afternoon with the team అంటూ మహేష్ బాబు SSMB28 పై ఇంట్రెస్టింగ్ గా అప్ డేట్ ఇచ్చారు. మరి త్రివిక్రమ్ తో మహేష్ బాబు చెయ్యబోయే సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్. అలా వైకుంఠపురములో టీం నే త్రివిక్రమ్ ఆల్మోస్ట్ మహేష్ మూవీ కోసం కంటిన్యూ చెయ్యబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ పూజ హెగ్డే, అలాగే ఇంకొంతమంది నటులని కూడా త్రివిక్రమ్ SSMB28 కోసం తీసుకోబోతున్నారు. ఇక త్రివిక్రమ్ - మహేష్ కాంబో టైటిల్ గా పార్ధు టైటిల్ ప్రచారంలో ఉంది. ఫైనల్ గా ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి. 

Interesting News On Mahesh Babu - Trivikram Combo SSMB28:

Mahesh-Trivikram work and chill in Dubai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ