Advertisementt

రష్మిక కి సారీ చెప్పిన సుకుమార్

Mon 27th Dec 2021 02:40 PM
rashmika,rashmika mandanna,director sukumar,pushpa movie,pushpa rashmika first look,sukumar sorry  రష్మిక కి సారీ చెప్పిన సుకుమార్
Sukumar says sorry to Rashmika రష్మిక కి సారీ చెప్పిన సుకుమార్
Advertisement
Ads by CJ

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ప్రస్తుతం ఐదు భాషల్లో థియేటర్స్ లో సందడి చేస్తుంది. పుష్ప సినిమాకి ఓ అన్నంత గొప్ప టాక్ రాకపోయినా.. సినిమా ని ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్,  అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ ని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్ గా శ్రీవల్లి పాత్రలో ఓకె ఓకె అనిపించింది. అయితే పుష్ప సినిమా నుండి రష్మిక శ్రీవల్లి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యినప్పుడు ఆ లుక్ పై చాలా ట్రోల్స్ నడిచాయి. రష్మిక లుక్ ఎవ్వరికి అంతగా ఎక్కలేదు. అయితే తాజాగా ఆ శ్రీవల్లి ఫస్ట్ లుక్ విషయం బాలయ్య అన్ స్టాపబుల్ షో లో ముచ్చటించారు.

శ్రీవల్లిగా రష్మిక లుక్ తీసి రష్మిక కి పంపారట దర్శకుడు సుకుమార్. కానీ రష్మిక ఈ లుక్ బాగోలేదు అని ఆమె సన్నిహితుల దగ్గర చెప్పడంతో.. సుకుమార్ ఫీలయ్యారట. మనకన్నా ఎక్కువ తెలుసా.. ఏ లుక్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందో అని అనుకున్నారట. కానీ రష్మిక లుక్ రిలీజ్ అయ్యాక.. చాలా నెగెటివ్ కామెంట్స్ పడ్డాయి. అప్పుడు రష్మిక రైట్ నేను రాంగ్ అనుకున్నాను. అప్పటినుండి రశ్మికకి సారీ చెప్పాలని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఈ అన్ స్టాపబుల్ స్టేజ్ పై చెబుతున్నాను అంటూ సుకుమార్ రశ్మికకి బాలయ్య సాక్షిగా సారి చెప్పారు. 

Sukumar says sorry to Rashmika:

Director Sukumar says sorry to Rashmika Mandanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ