ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ గురించి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాదు.. యావత్ భారత దేశం ఎదురు చూస్తుంది. బాలీవుడ్ నుండి శాండల్ వుడ్, కోలీవుడ్, మల్లు వుడ్ ఇలా ఐదు భాషల ప్రేక్షకులు ఆత్రంగా ఉన్నారు. రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలిసి ఆర్.ఆర్.ఆర్ మూవీ పై మరింతగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఆర్.ఆర్.ఆర్ గురించి మాట్లాడుతుంటే.. ఇంకా ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి తప్ప.. తరగడం లేదు. తాజాగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లోని కొన్ని సీక్రెట్స్ ని రివీల్ చేసారు.
అందులో ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుంది అని, ఈ ఒక్క సన్నివేశాన్ని 2000 మందికి పైగా ఆర్టిస్టులతో చిత్రీకరించామని రాజమౌళి వెల్లడించారు. బ్రిటీష్ సైనికుడిగా రామ్ చరణ్ బ్రిటిష్ వారిని తిరుగుబాటు చేసిన వారిని అడ్డుకుంటూ ఆ సన్నివేశంలో కనిపిస్తాడు అని.. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తుంది అని చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఆడియన్స్ కి షాకిస్తుంది అని.. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ 60 అడుగుల ఎత్తులో వెల్లడమే కాకుండా వారు నీటి అడుగున క్రిందికి వెళతారని, ఆక్సిజన్ అందిస్తే ఎప్పటికీ నీళ్లలోనే ఉంటామని ఎన్టీఆర్ తనకు షాకిచ్చాడని చెప్పారు రాజమౌళి.
ఓ యాక్షన్ సీన్ లో ఎన్టీఆర్ చాలా హైట్ నుండి ల్యాండ్ అయినప్పుడు ఎన్టీఆర్ మణికట్టుకు గాయం అయ్యిందని.. ఆ గాయం వలన 30 రోజులకు పైగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అని రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కి సంబందించిన కొన్ని సీక్రెట్స్ ని రివీల్ చేసారు.