Advertisementt

అల్లు అర్జున్ ఎపిసోడ్ చప్పగా వుంది

Sun 26th Dec 2021 10:30 PM
allu arjun,nandamuri balakrishna,sukumar,rashmika mandanna,un stoppable with nbk,un stoppable talk show,aha ott,aha video  అల్లు అర్జున్ ఎపిసోడ్ చప్పగా వుంది
Un stoppable With NBK Episode 6 streaming now అల్లు అర్జున్ ఎపిసోడ్ చప్పగా వుంది
Advertisement
Ads by CJ

ఆహా ఓటిటిలో అదరగొడుతున్న బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ లో ఈవారం పుష్ప టీం వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ రెండు రోజులు ముందే శుక్రవారం ప్రసారం కావలసి ఉండగా, ఏదో సాంకేతిక కారణాలు చెప్పి ఆ ఎపిసోడ్ ఈరోజు, ఆదివారం ప్రసారం చేసారు. అయితే ఈ ఎపిసోడ్ మాత్రం చాలా చప్పగా వుంది. ముందుగా బాలకృష్ణ ఈ షో కి దర్శకుడు సుకుమార్ ని ఆహ్వానించారు. సుక్కు తో బాలయ్య కాస్త ఫన్ చేసాక హీరోయిన్ రష్మిక షో కి ఎంటర్ అయ్యింది. సుకుమార్ - రష్మిక తోనే ఎక్కువగా ఈ ఎపిసోడ్ సాగింది. ప్రోమో లో, ఫొటోస్ లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ కూడా ఎపిసోడ్ చివరలో వచ్చి కొద్ది నిముషాలు మాత్రమే కనిపిస్తారు. 

ఆ కొద్ది సమయం లో కూడా అల్లు అర్జున్, బాలకృష్ణ ఒకరికి ఒకరు థాంక్స్ చెప్పుకోడంతోటే సరిపోయింది. అంతకు ముందు చేసినట్టుగా గెస్ట్స్ ని కొంచెం ఇంటరెస్టింగ్ ప్రశ్నలు వేస్తె బాగుండేది. ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కేవలం పుష్ప ప్రమోషన్ ఎపిసోడ్ అయిపొయింది. కావాలని ఈ ఎపిసోడ్ నిడివి తగ్గించేసారో లేక అలాగే చెయ్యాలని అనుకున్నారో కానీ ఈ ఎపిసోడ్ మాత్రం ప్లాప్. అల్లు  అర్జున్ ఎక్కువ సేపు కనపడి, బాలకృష్ణ గారు అతనితో సంభాషణ చూడాలని, వినాలని అనుకునే వాళ్ళకి ఈ ఎపిసోడ్ చాసోగాక నిరాశ ఎదురయ్యింది. అసలే ఆహా ఓటిటి అంతంత మాత్రంగా వుంది, అలాంటప్పుడు ఇలా చప్పగా వుండే ఎపిసోడ్స్ వల్ల మరికొంచెం వెనక్కి పోతుంది. 

Un stoppable With NBK Episode 6 streaming now :

Allu Arjun and Nandamuri Balakrishna on a single stage is the entertainment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ