ఏపీ లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టాలీవుడ్ ని కోలుకోకుండా చేస్తున్నాయి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు. ప్రెజెంట్ ఏపీలో సినిమా అనేది వినపడకుండా చేస్తున్నారు. ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని క్లోజ్. అంత జరుగుతున్నా టాలీవుడ్ హీరోలెవరూ నోరు మెదపడం లేదు. పవన్ కళ్యాణ్, హీరో నాని ఈ టికెట్ రేట్స్ విషయమై మాట్లాడుతుంటే.. ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయినా ఆ ఇద్దరికీ స్టార్ హీరోల మద్దతు లభించడం లేదు. నిన్నగాక మొన్న నాని ఏపీ ప్రభుత్వం ఆడియెన్స్ ని అవమానిస్తుంది టికెట్ రేట్స్ తగ్గించి అని మాట్లాడాడు.. దానితో ఏపీ మంత్రులు నాని ని ఏసుకున్నారు. తాజాగా నాని మరోసారి ఈ ఇష్యుపై సంచలనంగా మాట్లాడాడు.
శ్యామ్ సింగ రాయ్ సక్సెస్ అవడంతో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. అసలు ఏపీలో థియేటర్స్ లో టికెట్ రేట్స్ విషయం ఇప్పటిది కాదు. అది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ అప్పటినుండి ఈ ఇష్యు మొదలైంది. అప్పుడే సినిమా ఇండస్ట్రీ వారంతా ఒకే తాటిపైకి వచ్చి కలిసికట్టుగా స్పందించాల్సింది. కానీ ఎవరికి వాళ్ళే తమ సినిమాలు వచ్చినప్పుడు మట్లాడుదాం అని ఆగుతున్నారు. అప్పట్లోనే ఈ విషయమై ఇండస్ట్రీ మొత్తం కలిసి కట్టుగా మాట్లాడి ఉంటే ఈ సమస్య పెరిగేది కాదు. కానీ టాలీవుడ్ లో ఆ యూనిటీ లేదు. అందుకే ఏపీ ప్రభుత్వం ఇలా ఇష్టానుసారం చేస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు నాని.