జంజీర్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కి.. ఆ సినిమా కలిసిరాక.. టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాక.. పాన్ ఇండియా మూవీ తో గ్రాండ్ గా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ తో రామ్ చరణ్ అతిపెద్ద మార్కెట్ ని కొల్లగొట్టడానికి ఎన్టీఆర్ తో రెడీ అయ్యాడు. జనవరి 7 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీపై ఎంత క్రేజ్ ఉందో.. ఆయా ప్రమోషన్స్ లో ఫాన్స్ క్రేజ్ చూస్తే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ తో రామ్ చరణ్ నార్త్ లో చేసే ప్రమోషన్, సౌత్ ప్రమోషన్స్ తో ఆ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది. అల్లూరి సీత రామ రాజుగా ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ యాక్టింగ్ అలాగే అతని బాడీ లాంగ్వేజ్ అన్ని అద్భుతమే.
రాజమౌళి రామ చరణ్ రేంజ్ ని ఆర్.ఆర్.ఆర్ తో 100 రెట్లు పెంచడమే కాదు.. రామ్ చరణ్ రెమ్యునరేషన్ కూడా ఆర్.ఆర్.ఆర్ తో 100 రెట్లు పెరిగినట్లే.
అంటే రామ్ చరణ్ తదుపరి మూవీస్ మూవీ RC15, ఆ నెక్స్ట్ RC16 కి రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే న్యూస్ మెగా ఫాన్స్ ని షేక్ చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ తో రామ్ చరణ్ RC15 మూవీ మూడు భాషల్లో చేసున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ తో కలిసి RC15 రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసేసాడు. ఈ సినిమాలో చరణ్ సిబిఐ ఆఫీసర్ గా స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఇక RC16 ని చరణ్ జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలకి రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడట. మేకర్స్ కూడా చరణ్ పాన్ ఇండియా క్రేజ్ కారణంగానే 100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. మరి RC15 ప్రొడ్యూసర్ దిల్ రాజే చరణ్ కి 100 కోట్ల పారితోషకం ఇవ్వడం మాములు విషయం కాదు.