మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేకిచ్చి.. స్పెయిన్ వెళ్లి అక్కడ మోకాలి సర్జరీ చేయించుకుని.. తర్వాత కొద్ది రోజుల విశ్రాంతి కోసం దుబాయ్ వెళ్లారు. దుబాయ్ వెళ్లిన మహేష్ కి ప్రస్తుతం ఫ్యామిలీ కూడా తోడైంది. టాలీవుడ్ నుండి ఏ ఫ్యామిలీ కూడా మహేష్ బాబు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టుగా, వెకేషన్స్ కి వెళ్లినట్టుగా ఎవ్వరూ వెళ్ళరు. ఈమధ్యనే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులులో ఎన్టీఆర్ .. కరోనా తో లాక్ డౌన్ పెట్టగానే అన్నా నాకు నువ్వే గుర్తొచ్చావ్ అన్నాడు ఎన్టీఆర్, దానికి మహేష్ సరదాగా దిష్టి తగిలింది అందుకే ఇలా.. ఇక మీరు హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.. పిల్లలకి ఎలా కుదురుతుంది. అనగానే వాళ్ళు హైదరాబాద్ లో ఉంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ రాగానే.. వెకేషన్స్ కి తీసుకుని వెళితే వాళ్లతో మనం టైం స్పెండ్ చెయ్యొచ్చని స్వార్ధం అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మహేష్ దగ్గరికి క్రిష్టమస్ హాలిడేస్ ఇవ్వగానే సితార, గౌతమ్ లు వెళ్లిపోయారు. తండ్రితో క్రిష్ట్మస్ సెలెబ్రేట్ చేసుకున్న పిల్లలు.. ప్రస్తుతం దుబాయ్ షాపింగ్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక రేపు రాబోయే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని కూడా మహేష్ తన పిల్లలతో దుబాయ్ లోనే సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. మరి క్రిష్ట్మస్, న్యూ ఇయర్ వేడుకలని మహేష్ ఫ్యామిలీతో కలిసి చేసుకోబోతున్నారన్నమాట. ఇక కొన్ని రోజుల తర్వాత మహెష్ దుబాయ్ నుండి రాగానే.. సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అవుతారు.