బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కి వాళ్ళ క్రేజ్, రేంజ్ ని బట్టి పారితోషకాలు ఉంటాయి. వెండితెరమీదైనా, బుల్లితెర మీదైనా వాళ్లకున్న రేంజ్ ని దృష్టిలో పెట్టుకునే వారి పారితోషకాలు డిసైడ్ అవుతాయి. విన్నర్ గా గెలిచిన వారికి ట్రోఫీ తో పాటుగా.. వాళ్లకు వచ్చే పారితోషకం వస్తుంది. అలాగే ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో టైటిల్ ఫెవరెట్స్ గా దిగిన వారు షాకింగ్ గా ముందు ఎలిమినేట్ అవడం, తర్వాత రన్నర్ గా సరిపెట్టుకోవడం సీజన్ 5 లో చూసాం. యూట్యూబర్ షణ్ముఖ్, యాంకర్ రవి లు బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ ఫెవరెట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు. కానీ రవి 12 వ వారంలో ఎలిమినేట్ అయ్యి షాకిచ్చాడు. ఇక షణ్ముఖ్ కేవలం రన్నర్ గానే సరిపెట్టుకున్నాడు.
అయితే బిగ్ బాస్ విన్నర్ గా సన్నీ గెలిచాడు. అతనికి పారితోషకం గా 30 లక్షలు, ప్రైజ్ మనీ గా 78 లక్షలను సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ కలుపుకుంటే అతడు బిగ్ బాస్ షో ద్వారా 1.08 లక్షలు సంపాదించాడు. ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న షణ్ముఖ్ కి 15 వారాలకు గాను 75 లక్షలు చెల్లించారని, తర్వాత స్థానంలో ఉన్న శ్రీరామ్ కి 15 వారాలకు 45 లక్షలు, మిస్టర్ పెఫెక్ట్ మానస్ కి 30 లక్షలు చెల్లించినట్టుగా తెలుస్తుంది. అయితే టైటిల్ ఫెవరెట్ గా బిగ్ బాస్ లోకి వచ్చిన యాంకర్ రవి 12 వారంలోనే ఎలిమినేట్ అయినా. వారానికి పది లక్షల హైయ్యెస్ట్ పారితోషకంతో.. అందరికన్నా ఎక్కువ రెన్యుమరేషన్ అందుకున్న వ్యక్తిగా రవి నిలిచాడు.
రవి క్రేజ్ దృష్ట్యా వారానికి పది లక్షల పారితోషకంతో 12 వారాలకు గాను రవి బిగ్ బాస్ విన్నర్ కన్నా అధికంగా 1.20 లక్షలు అందుకున్నాడని అంటున్నారు. సో రవి ఈ సీజన్ హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.