టాలీవుడ్ లో అతి పెద్ద సినీ కుటుంబం మెగా కుటుంబమే. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఏ ఫ్యామిలీ నుండి సినిమా ఇండస్ట్రీకి రాలేదు. మెగాస్టార్ చిరు నుండి పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ తేజ్, వైష్ణవ్, సాయి ధరమ్ ఆఖరికి చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇలా మెగా హీరోలే ఎక్కువగా ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలిలో ఫెస్టివల్స్, బర్త్ డే పార్టీస్ అలాగే ప్రవేట్ పార్టీస్ ని అందరూ కలిసి కట్టుగా ఘనంగా జరుపుకుంటారు. ఈమధ్యనే చిరు బర్త్ డే పార్టీ అలాగే దివాళి సెలెబ్రేషన్స్ అన్నిటిని అట్టహాసంగా నిర్వహించింది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ - ఉపాసనలు హోస్ట్ లుగా ఈ సెలెబ్రేషన్స్ మెగా ఫ్యామిలిలో ఆకాశాన్ని తాకుతుంటాయి.
తాజాగా మెగా ఫ్యామిలీ క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో నిర్వహించినట్టుగా క్రిస్టమస్ రోజున బయటికి వచ్చిన మెగా ఫ్యామిలీ పిక్ చూస్తే అర్ధమవుతుంది. వినాయక చవితికి బైక్ యాక్సిడెంట్ అయ్యి కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన సాయి ధరమ్ తేజ్ కూడా ఈ మెగా పిక్ లో మెరిశాడు. రామ్ చరణ్ - ఉపాసన, అల్లు అర్జున్ - స్నేహ, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఆమె హస్బెండ్ చైతన్య, వైష్ణవ్ తేజ్, చిరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ ఇలా అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి.. మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మెగా క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.