మంచు విష్ణు కనిపించడం లేదు.. ఇది సినిమా లవర్స్, మీమర్స్, నెటిజెన్స్ వేస్తున్న ప్రశ్న. ఎందుకంటే.. ఏపీలో సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా చూడనట్లుగా, ఏం మాట్లాడకుండా ఉండిపోయాడని. మా ఎన్నికలప్పుడు అది పొడిచేస్తాను, ఇది పొడిచేస్తాను.. అందరికి అండగా ఉంటాను అంటూ ఓట్స్ వేయించుకుని.. మా అధ్యక్షుడిగా గెలిచాక.. పక్క రాష్ట్రంలో అది కూడా తన చుట్టమే సీఎం అయిన రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద నష్టం జరుగుతుంటే.. హీరోలు స్పందిస్తున్నారు కానీ.. మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా తనకేం పట్టనట్టుగా కూర్చోవడం చూసిన వాళ్ళు మంచు విష్ణు కనిపించడం లేదు.. కంప్లైంట్ ఇవ్వండిరా అంటున్నారు.
గతంలో ఏపీలో టిడిపి ప్రభుత్వం వలన అన్యాయం జరుగుతుంది అంటూ ధర్నాలు చేసిన మోహన్ బాబు.. ఇప్పుడు తన కొడుకు ద్వారా ఏపీ సీఎం తో చుట్టరికం కలవడమే కాదు.. వైసిపి ప్రభుత్వంతో రాసుకుపూసుకుతిరుగుతున్నారు. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీ పై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలని జగన్ తో మాట్లాడి చర్చించవచ్చు కదా. మా అబ్బాయ్ మా అధ్యక్షుడు అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక్క సమస్య ఉండదు.. అన్ని పరిష్కరిస్తారు అని హామీ ఇచ్చిన మనిషి కనిపించడం లేదు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుంది అని చిన్నపిల్లాడికి కూడా అర్ధమవుతుంది. కానీ మంచు విష్ణుకి ఎందుకో ఇంకా అర్ధం కావడం లేదు.. అంటూ సెటైరికల్ కామెంట్స్ తో మీమ్స్ చేస్తున్నారు. మంచు విష్ణు కనిపించడం లేదురా భాయ్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. మరి మంచు విష్ణు ఇప్పటికైనా నిద్ర లేస్తాడేమో చూడాలి.