వేరే భాష నుండి వచ్చిన నటీమణులు కథలు వినరు, మేనేజర్ వింటారు అనే మాట మామూలుగా వినిపిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని శ్యామ్ సింగ రాయ్ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ని అడిగితే ఆమె కథలు తానే వింటాను అంటోంది. నేను, మా అమ్మ కూర్చొని వింటాము అని.. కథలు బాగుంటే వెంటనే నేను అమ్మ డిసైడ్ చేస్తాము అని చెప్తోంది కృతి. ఆమె నటించిన శ్యామ్ సింఘా రాయ్ శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ తో నడుస్తోంది. ఉప్పెన తరువాత కృతి శెట్టి చేసిన సినిమా ఇది.
అయితే ఉప్పెన తరువాత కృతి శెట్టి కి అలాంటి పాత్రలే ఎక్కువ వచ్చాయని, అయితే కొంచెం వైవిధ్యం వున్న పాత్రలు చెయ్యాలనుకుంటున్నాని అందుకే నాని పక్కన శ్యామ్ సింఘా రాయ్ లో ఈ మోడరన్ గర్ల్ పాత్ర ఒప్పుకున్నా అని చెప్తోంది. తనకి స్మోకింగ్ అంటే ఇష్టం లేదని, కానీ శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం చేశా అంటోంది. ఈ సీన్ తీసెయ్యండి అని చెప్పాను, కానీ అది అవసరం అన్నారు, అందుకే చేశా అంటోంది. కృతి శెట్టి మూడు రోజులు ప్రాక్టీస్ కూడా చేసిందట ఈ స్మోకింగ్ సీన్ కోసం.