Advertisementt

సీఎం జగన్ ని కలవనున్న చిరంజీవి

Sat 25th Dec 2021 05:19 PM
chiranjeevi,tollywood,cm jagan,ap cm,perni nani,cinema industry  సీఎం జగన్ ని కలవనున్న చిరంజీవి
Chiranjeevi to meet CM Jagan సీఎం జగన్ ని కలవనున్న చిరంజీవి
Advertisement
Ads by CJ

రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం సినిమా టికెట్స్ రేట్ గురించి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ రేట్స్ పెంచిన విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ తరపున కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఈ టికెట్ రేట్స్ విషయం మీద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలవాలని నిర్ణయించారు. 

ఇందుకు ముందుగా ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని ని ఒకటి రెండు రోజుల్లో చిరంజీవి కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ టికెట్స్ రేట్స్ విషయం లో అవసరం అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కూడా కలిసే అవకాశం కూడా ఉంది. గత కొద్ది రోజుల్లో ఆంధ్ర లో చాలా సినిమా హాల్స్ మూతపడిన సంగతి కూడా తెలిసిందే. జనవరి 7 న పెద్ద సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతున్న సందర్భంగా ఆ చిత్ర విడుదలకు ముందే ఈ టికెట్ రేట్ గురించి అక్కడ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని చిరంజీవి అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా బడ్జెట్ కి  ఇప్పుడున్న టికెట్ రేట్స్ ఏమి ఉపయోగం ఉండదు.

Chiranjeevi to meet CM Jagan:

Chiranjeevi to meets Perni Nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ