Advertisementt

విజయాన్ని ఆస్వాదించే అదృష్టం లేదు

Sat 25th Dec 2021 01:09 PM
nani,shyam singha roy,shyam singha roy hd movie,shyam singha roy movie success celebrations,shyam singha roy movie hit,ap theaters close  విజయాన్ని ఆస్వాదించే అదృష్టం లేదు
Audience and Critics Announce Nani Shyam Singha Roy A Blockbuster విజయాన్ని ఆస్వాదించే అదృష్టం లేదు
Advertisement
Ads by CJ

కొన్ని సినిమాల ప్లాప్ తర్వాత మళ్ళీ చాన్నాళ్ళకి మంచి విజయం అందుకుని సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఎంజాయ్ చెయ్యాలనుకున్న నాని కి ఇప్పుడు ఆ విజయాన్ని ఆస్వాదించే అదృష్టం లేకుండా పోయింది అనే చెప్పాలి. రీసెంట్ గా క్రిష్టమస్ స్పెషల్ గా రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ తో నాని అద్భుతమైన విజయం సాధించాడు. వరస ప్లాప్స్ తో సతమతమైన నానిని శ్యామ్ సింగ రాయ్ ఆదుకున్నట్టే. నాలుగు భాషల్లో అదరగొట్టేసే ప్రమోషన్స్ తో డిసెంబర్ 24 న రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ కి పాజిటివ్ టాక్ వచ్చేసింది. అటు క్రిటిక్స్ కూడా నాని శ్యామ్ సింగ రాయ్ కి మంచి రేటింగ్స్ తో రివ్యూస్ ఇవ్వడంతో.. సినిమాకి హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ ఆ విజయాన్ని నాని ఆస్వాదించలేకపోతున్నాడు.

కారణం ఆంధ్రలో కొన్ని చోట్ల థియేటర్స్ యాజమాన్యాలు స్వచ్ఛందగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా థియేటర్స్ క్లోజ్ చేస్తే.. మరికొన్ని చోట్ల ప్రభుత్వమే థియేటర్స్ సీజ్ చేసింది. అలాగే శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఫుల్ హెడ్ మూవీ ఆన్ లైన్ లో రిలీజ్ చేసి తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వెబ్ సైట్స్ శ్యామ్ సింగ రాయ్ మేకర్స్ కి షాకిచ్చాయి. శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొద్ది గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను పెట్టెయ్యడంతో సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం ఉంది. అటు ఏపీలో థియేటర్స్ క్లోజ్.. ఇటు శ్యామ్ సింగ రాయ్ మూవీ లీక్ తో కలెక్షన్స్ తగ్గడం ఖాయం. సో మంచి హిట్ అందుకున్న నాని.. ఆ విజయాన్ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.

Audience and Critics Announce Nani Shyam Singha Roy A Blockbuster:

Nani Shyam Singha Roy HD Movie leaked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ