Advertisementt

కీర్తి అసిస్టెంట్ కి కరోనా: భయపడ్డ సూపర్ స్టార్

Sat 25th Dec 2021 12:02 PM
rajinikanth,super star rajinikanth,keerthy suresh,annaatthe,covid,challenging experience  కీర్తి అసిస్టెంట్ కి కరోనా: భయపడ్డ సూపర్ స్టార్
Rajinikanth recalls close brush with Covid on Annaatthe sets కీర్తి అసిస్టెంట్ కి కరోనా: భయపడ్డ సూపర్ స్టార్
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ కి చెల్లెలిగా నటించి మరో సూపర్ స్టార్ మహేష్ సినిమా దార్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి చెల్లెలిగా కీర్తి సురేష్ అన్నాత్తే సినిమాలో నటించింది. ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సో సో టాక్ తెచ్చుకున్నా.. రజిని మ్యానియాతో అదరగొట్టే కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కీర్తి సురేష్ అసిస్టెంట్ కి కరోనా సోకినా అతను చెప్పకపోవడంతో తర్వాత చాలా భయపడినట్లుగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్నాత్తే సినిమా రిలీజ్ అయ్యి గురువారం నాటికీ 50  రోజులు పూర్తయిన సందర్భంగా రజిని అన్నాత్తే షూటింగ్ ముచ్చట్లు, ఆ షూటింగ్ సమయంలో చాలామంది కోవిడ్ బారిన ఎలా, ఎందుకు పడ్డారో చెప్పుకొచ్చారు

అన్నాత్తే షూటింగ్ మొదలు పెట్టాక కోవిడ్ కారణంగా 9 నెలలు షూటింగ్ కి దూరమయ్యామని, తర్వాత డిసెంబర్ లో హైదరాబాద్ లో అన్నాత్తే కోసం ఓ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నామని, రోజూ అందరూ కోవిడ్ పరిక్షలు చేయించుకుని షూటింగ్ కి హాజరయ్యేవారమని, అలాగే మాస్క్ లతోనే రిహార్సల్స్ చేసేవాళ్లమని, కానీ కీర్తి సురేష్ అసిస్టెంట్ కి కరోనా సోకినా అది దాచిపెట్టి అతను ఐదు రోజుల పాటు సెట్స్ లోకి వచ్చేసాడు. ఆ టైం లోనే నేను కీర్తి సురేశ్‌తో కొన్ని సీన్స్ చేశాను. ఆ అసిస్టెంట్ ఎప్పుడూ మా పక్కనే ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసి సెట్‌లో ఉన్నవాళ్లందరం భయపడ్డాం. అందరం పరీక్షలు చేయించుకున్నాం, వెంటనే షూట్‌ని నిలిపివేశాం అంటూ చెప్పుకొచ్చారు రజిని.

Rajinikanth recalls close brush with Covid on Annaatthe sets:

Rajinikanth recalls shooting for Annaatthe amid COVID, says a challenging experience

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ