ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన రాధే శ్యామ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఒక్క రోజులోనే ఈ చిత్ర ట్రైలర్ 64 మిలియన్ వ్యూస్ అందుకుని ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 23న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల చేసారు.
లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది. సంక్రాంతి 2022 జనవరి 14 న ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.