రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలయికలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ముగించుకుంటూ.. రిలీజ్ కి రెడీఅవుతున్న టైం లో.. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ పై సస్పెన్స్ ఏమిటి అనుకుంటున్నారా.. కోవిడ్ అండి.. ఇంకేం ఉంటుంది.. అంత రెడీ అయ్యాక రిలీజ్ ఆగిపోవడానికి పెద్ద కారణం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ జనాలని భయపెట్టిన కరోనా మహమ్మారి.. థర్డ్ వేవ్ మళ్ళీ ఎంటర్ అయ్యింది.. కరోనా ఎఫెక్ట్ చాలా రాష్ట్రాలపై పంజా విసురుతుండడంతో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధిస్తే.. మహారాష్ట్రలో సినీ లవర్స్ కి షాకిస్తూ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ విధించింది. అంటే థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ అంటే మళ్ళి పెద్ద సినిమాలకు గుది బండ పడినట్లే.
జనవరి 7 న రిలీజ్ కి భారీగా రంగం చేస్తున్న రాజమౌళి.. అతిపెద్ద మార్కెట్ బాలీవుడ్ లో 50 పర్సెంట్ అక్యుపెన్సీతో సినిమాని రిలీజ్ చేస్తారా? చేస్తే ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా.. సినిమాకి కలెక్షన్ రావు. కేవలం ఆర్.ఆర్.ఆర్ మాత్రమే కాదు.. జనవరి 14 న రిలీజ్ కాబోతున్న రాధే శ్యామ్ రిలీజ్ పై అనుమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ఆర్.ఆర్.ఆర్ గనక రిలీజ్ చేస్తే కలెక్షన్ లో కోత పడుతుంది.. సో రాజమౌళి అయితే అయ్యింది అని రిలీజ్ కి రెడీ అవుతారా? లేదంటే రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారా అనేది ఇప్పుడు అందరిలో మొదలైన సస్పెన్స్.